Telangana: జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు బిగ్ షాక్.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎస్ శాంతి కుమారి
జూనియర్ పంచాయతీ సెక్రటరీల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ పంచాయతీ సెక్రటరీలను చర్చలకు పిలిచేదిలేదని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. విధుల్లో ఉన్నవారి జాబితా పంపించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశించారు. సమ్మె విరమించి వస్తే విధుల్లో చేరవచ్చు.. లేకుంటే తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేనట్లేనన్నారు.
జూనియర్ పంచాయతీ సెక్రటరీల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ పంచాయతీ సెక్రటరీలను చర్చలకు పిలిచేదిలేదని సీఎస్ శాంతి కుమారి స్పష్టం చేశారు. విధుల్లో ఉన్నవారి జాబితా పంపించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశించారు. సమ్మె విరమించి వస్తే విధుల్లో చేరవచ్చు.. లేకుంటే తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేనట్లేనన్నారు. అలాగే విధులకు హాజరుకాని వారి స్థానాల్లో కొత్త వారిని తాత్కాలిక కార్యదర్శులుగా నియమించాలని ఆదేశించారు. గతంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరీక్ష రాసిన వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పంచాయతీరాజ్ జూనియర్ సెక్రటరీల విషయంలో టర్మీనెట్ చేయాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసేందని సీఎస్ తెలిపారు. ఈ మేరకు శనివారం జిల్లా పంచాయతీ ఆఫీసర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల లోపు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. అంతేకాదు ఉద్యోగాలకు రాకపోతే వారిని ఉద్యోగుల కింద పరిగణించబడదని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఈ మేరకు శనివారం నాడు విధుల్లో ఉన్నవారి జాబితాను మధ్యాహ్నం లోపు పంపాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పనిచేసే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ సర్వీసును క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో ఆందోళనలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో కొత్తగూడెం జిల్లాకు చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వినూత్న నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గోదావరి నదిలో జలదీక్షకు దిగుతామని సర్కార్‌ను హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..