- Telugu News Photo Gallery Vitamin D rich foods that you must include in your daily diet, check to know full list
Healthcare: విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహారాలివే.. తింటే రోగనిరోధక శక్తితో పాటు, ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం..
Health Tips: శరీరానికి తప్పక అందవలసిన పోషకాలలో విటమిన్ డి కూడా ఒకటి. ఈ విటమిన్ శరీరంలో రోగనిరోధక వ్యవస్థని పెంచి, ఎముకలు బలంగా ఉండటానికి, బోలు ఎముకల వ్యాధి నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది. సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి శరీరానికి లభించినప్పటికీ కొన్ని రకాల ఆహారాలపై ఆధార పడవలసి ఉంటుంది. మరి విటమిన్ డి కోసం ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: May 12, 2023 | 9:21 PM

Vitamin D: రోజువారి ఆహారంలో పోషకాలు సరిపడా ఉండడం చాలా అవసరం. లేకపోతే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ క్రమంలో ఏదైనా పోషకం శరీరానికి తగినంతగా లభించకపోతే దాని లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. ఫలితంగా అనేక రకాల దుష్ప్రభావాలు శరీరంపై కలుగుతాయి.

పుట్టగొడుగులు: విటమిన్ డి కోసం పుట్టగొడుగులు మంచి మూలం. పుట్టగొడుగులు సూర్యకాంతిలో పెరుగుతాయి కాబట్టి వాటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అంతేకాక పుట్టగొడుగులలో విటమిన్లు B1, B2, B5 కూడా ఉంటాయి.

సాల్మన్: సాల్మన్ చేపలు అధిక నాణ్యత కలిగిన లీన్ ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. అదనంగా, ఇందులో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇంకా ఈ చేపల్లో ప్రొటీన్లు, విటమిన్ బి6 కూడా అధికంగా లభిస్తాయి. చేపలన్నింటిలో సాల్మన్ చేపలు చాలా ప్రయోజనకరమైనవి.

కాడ్ లివర్ ఆయిల్: శరీరానికి కావలసిన సప్లిమెంట్స్‌లో కాడ్ లివర్ ఆయిల్ కూడా ఒకటి. కాడ్ ఫిష్ అనే చేపల లివర్ నుంచి ఈ ఆయిల్‌ను తీస్తారు. ఇది రికెట్స్, సోరియాసిస్ , క్షయవ్యాధి చికిత్సలో భాగంగా ఉపయోగిస్తున్నారు. ఈ నూనెలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, అధిక మొత్తాల్లో విటమిన్ ఎ, డి ఉంటాయి. దీంతో శరీరంలోని మంట తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

సోయా పాలు: సోయాపాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సోయా మిల్క్‌ని ఎండిన సోయాబీన్‌లను నానబెట్టి, వాటిని నీటితో రుబ్బడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఈ పాలు సాధారణ ఆవు పాలతో సమానమైన ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. ఇందులో అధిక విటమిన్ డి, విటమిన్ సి, ఐరన్ఒ, మేగా3, 6 ఫ్యాటీ యాసిడ్లు, అత్యంత శక్తి వంతమైన ఫైటో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

గుడ్డు సొనలు: శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు గుడ్ల ద్వారా లభిస్తాయి. గుడ్లు విటమిన్ డిని మంచి మూలం కూడా. ఇంకా ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, సెలీనియం, ఒమేగా -3 కొవ్వులు, ఫోలేట్ వంటి పలు పోషకాలు ఉంటాయి. అయితే ఒక గుడ్డులో దాదాపు 200 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది, కాబట్టి ప్రతిరోజూ తినకూడదు.





























