Women’s Health: ఈ 5 టిప్స్ పాటించారంటే చాలు.. డెలివరీ తర్వాత కూడా స్లిమ్ అండ్ ఫిట్‌గా ఉండొచ్చు..
Women Lose Weight: చాలా మంది మహిళల్లో తల్లి అయినప్పుడు వారి శరీరంలో అనేక రకాల మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా డెలివరీ తర్వాత విపరీతంగా బరువు పెరుగుతారు. అంతేకాక తల్లి అయ్యాక పిల్లల బాధ్యత కూడా వాళ్లపైనే ఎక్కువగా..
Women Lose Weight: చాలా మంది మహిళల్లో తల్లి అయినప్పుడు వారి శరీరంలో అనేక రకాల మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా డెలివరీ తర్వాత విపరీతంగా బరువు పెరుగుతారు. అంతేకాక తల్లి అయ్యాక పిల్లల బాధ్యత కూడా వాళ్లపైనే ఎక్కువగా ఉండడంతో తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపలేకపోతుంటారు. అలా అని వర్కవుట్స్, ఇతర పనులు చేయలేరు. ఫలితంగా వారి శరీరంలో కొవ్వు బాగా పెరుకుపోతుంది. ఈ కారణంగానే డెలివరీ తర్వాత ఎక్కువగా బరువు పెరుగుతారు. అయితే తల్లిగా ఉన్న మహిళు బరువు తగ్గేందుకు కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే చాలు.. బరువు తగ్గిపోతారని నిపుణులు చెబుతున్నారు. మరి వారు చెబుతున్న సూచనలేమిటో ఇప్పుడు చూద్దాం..
అజ్వైన్ నీరు: డెలివరీ అయిన తర్వాత మహిళల్లో పెరిగిన కొవ్వును కరిగించడానికి అజ్వైన్ నీరు చాలా మెరుగ్గా సహాయపడుతుంది. ఇందుకోసం గోరువెచ్చని అజ్వైన్ నీటిని రోజంతా తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఖాళీ కడుపుతో రెండు సార్లు తిన్న తరువాత మరోసారి తాగితే బరువు తగ్గడంతో పాటు గ్యాస్ సమస్య నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
గ్రీన్ టీ: బరువు తగ్గడానికి సులభమైన మార్గంగా గ్రీన్ టీని భావిస్తారు. గ్రీన్ టీలో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు బాలింతల్లోని బరువును వేగంగా తగ్గిస్తుంది. అలాగే వారి చర్మాన్ని మెరుగుపరుస్తుంది.
బాదం, ఎండుద్రాక్ష: డెలివరీ అయిన మహిళలకు బాదం, ఎండుద్రాక్ష కూడా చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి. బరువు తగ్గాలనుకునే బాలింతలు 10 ఎండుద్రాక్ష, 10 బాదంపప్పు గింజలు కలిపి పౌడర్‌గా చేసుకొని గోరువెచ్చని పాలతో కలిపి తాగితే చాలు.. అనతి కాలంలోనే స్లిమ్ అండ్ ఫిట్‌గా తయారవుతారు.
దాల్చిన చెక్క, లవంగాలు: బాలింతలలో పెరిగే బెల్లీఫ్యాట్‌ని తగ్గించడానికి దాల్చిన చెక్క, లవంగాలు సహాయపడతాయి. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో 2, 3 లవంగాలు, దాల్చిన చెక్క ముక్క వేసి మరిగించాలి. ఆ నీటిని గోరువెచ్చగా తాగితే చాలు.. మంచి ఫలితాలు ఉంటాయి.
సింపుల్ వ్యాయామాలు: బరువు తగ్గాలనుకునే మహిళలకు ఇలాంటి ఆహారపు అలవాట్లతో పాటు, కొంత శారీరక శ్రమ కూడా అవసరం. ఇందుకోసం మీరు వ్యాయామం చేయలేకపోతే ఉదయం, సాయంత్రం కొంత సమయం ప్రాణాయామం చేయండి. ఇదే కాకుండా ఉదయం, సాయంత్రం కనీసం అరగంట పాటు నడిస్తే మీ బరువు తగ్గుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..