Karnataka Election Results 2023: 50 వేల కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచిన నాయకులు వీరే.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే..?

Karnataka Election Results 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగ్గా వాటి ఫలితాలు 13న వెలువడ్డాయి. ఇక ఈ ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ 136 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. అధికార బీజేపీ 65 సీట్లు గెలుచుకోగా...

Karnataka Election Results 2023: 50 వేల కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచిన నాయకులు వీరే.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే..?
Karnataka Election Results 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 14, 2023 | 6:30 AM

Karnataka Election Results 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగ్గా వాటి ఫలితాలు 13న వెలువడ్డాయి. ఇక ఈ ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ 136 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. అధికార బీజేపీ 65 సీట్లు గెలుచుకోగా, జేడీ(ఎస్) 19 స్థానాలతో మూడో స్థానంలో నిలిచింది. మరో 4 స్థానాలలో ఇతరులు గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో 50 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందిన అభ్యర్థులు కూడా ఉన్నారు. మరి ఆయా అభ్యర్థులు, వారు గెలుపొందిన నియోజకవర్గాల వివరాలు ఇప్పుడు చూద్దాం..

కనకపూర్: డీకే శివకుమార్ (కాంగ్రెస్), 1,22,393 ఓట్ల ఆధిక్యం

కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివకుమార్ బీజేపీ అభ్యర్థి, రెవెన్యూ మంత్రి ఆర్ అశోకపై 1,22,393 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శివకుమార్ 1,43,023(75.03 శాతం) ఓట్లతో విజయం సాధించారు.

ఇవి కూడా చదవండి

చిక్కోడి సదల్గా: గణేష్ ప్రకాష్ హుక్కేరి (కాంగ్రెస్), 78,509 ఓట్ల మెజారిటీ

బీజేపీ అభ్యర్థి కత్తి రమేష్ విశ్వనాథ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ ప్రకాష్ హుక్కేరి 78,509 ఓట్ల తేడాతో గెలుపొందారు. గణేష్ ప్రకాష్ హుక్కేరికి 1,27,324( 69.82 శాతం) ఓట్లు వచ్చాయి.

అథ్ని: లక్ష్మణ సవాడి (కాంగ్రెస్), 76,122 ఓట్ల పైచేయి

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన లక్ష్మణ సవాది 76,122 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి మహేశ్ కుమ్తల్లిపై విజయం సాధించారు. లక్ష్మణ్ సవాడి 1,30,478(68.34 శాతం) ఓట్లు సాధించారు. సవాడి ప్రత్యర్థి కుమ్తల్లికి 54,805 ఓట్లు మాత్రమే వచ్చాయి.

పులకేశినగర్: ఏసీ శ్రీనివాస (కాంగ్రెస్), 62,210 ఓట్ల ఆధిక్యం

పులకేశినగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఏసీ శ్రీనివాస్ తన ప్రత్యర్థి బీఎస్పీ అభ్యర్థి అఖండ శ్రీనివాస్ మూర్తిపై 62,210 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శ్రీనివాస్ 87,214(66.72 శాతం) ఓట్లు సాధించగా, ప్రత్యర్థి అకండ శ్రీనివాస్ మూర్తి 25,106(19.18 శాతం) ఓట్లనే సాధించారు.

కొల్లేగల: ఏఆర్ కృష్ణమూర్తి (కాంగ్రెస్), 59,519 ఓట్ల ఆధిక్యం

కొల్లేగల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ఏఆర్‌ కృష్ణమూర్తి 59,519 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎన్‌ మహేశ్‌పై విజయం సాధించారు. కృష్ణమూర్తికి 1,08,363(64.59 శాతం) ఓట్లు రాగా, మహేశ్‌కు 48,844(29.11) ఓట్లు వచ్చాయి.

యమకనమరడి: సతీష్ లక్ష్మణరావు జారకిహోళి (కాంగ్రెస్), 57,211 ఓట్ల ఆధిక్యం

యమకనమరడి కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ లక్ష్మణరావు జారకిహోళి 57,211 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి బసవరాజ్ హుంద్రిపై విజయం సాధించారు. సతీష్ జారకిహోళికి 1,00,290( 60.25%) ఓట్లు వచ్చాయి.

బెల్గాం రూరల్: లక్ష్మీ ఆర్ హెబ్బాల్కర్ (కాంగ్రెస్), 56,016 ఓట్ల ఆధిక్యం

బెల్గాం రూరల్ అభ్యర్థి లక్ష్మీ ఆర్ హెబ్బాల్కర్ 56,016 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి నగేష్ అన్నప్ప మనోల్కర్‌పై విజయం సాధించారు. హెబ్బాల్కర్‌కు 1,07,619ట(52.61 శాతం) ఓట్లు వచ్చాయి.

సర్వజ్ఞనగర్: జోసెఫ్ జార్జ్ (కాంగ్రెస్), 55,768 ఓట్ల ఆధిక్యం

సర్వజ్ఞనగర్ కాంగ్రెస్ అభ్యర్థి జోసెఫ్ జార్జ్ తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పద్మనాభరెడ్డిపై 55,768 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. జోసెఫ్ జార్జ్ 1,18,783(61.04 శాతం) ఓట్లు సాధించారు.

పద్మనాభ నగర్: ఆర్ అశోక (బీజేపీ), 55,175 ఓట్ల ఆధిక్యం

దేవాదాయ శాఖ మంత్రి, పద్మనాభ నగర్ బీజేపీ అభ్యర్థి ఆర్ అశోక తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వి రఘునాథ్ నాయుడుపై 55,175 ఓట్ల తేడాతో గెలుపొందారు. అశోక్‌కు 98,750(61.72 శాతం) ఓట్లు వచ్చాయి.

బసవనగుడి: ఎల్‌ఏ రవి సుబ్రహ్మణ్య (బీజేపీ)కి 54,978 ఓట్ల ఆధిక్యం

బసవనగుడి బీజేపీ అభ్యర్థి ఎల్‌ఏ రవి సుబ్రహ్మణ్య కాంగ్రెస్ అభ్యర్థి యూబీ వెంకటేశ్‌పై 54,978 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రవి సుబ్రహ్మణ్యకు 78,854(61.47 శాతం) ఓట్లు వచ్చాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్