Gold Price Today: తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్న బంగారం ధర.. ఆదివారం తులం గోల్డ్ ఎంతో తెలుసా.?
దేశంలో బంగారం ధరలు మండిపోతున్నాయి. రికార్డ్ స్థాయికి బంగారం ధర చేరింది. తులం బంగారం రూ. 50 వేలు దాటితేనే వామ్మో అనుకున్న రోజుల నుంచి ఇప్పుడు ఏకంగా రూ. 60 వేలు దాటేసి రూ. 62 వేలకు చేరువైంది. ఇక శనివారం బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడిందని సంతోషించేలోపే ఆదివారం మళ్లీ పెరిగి షాక్ ఇచ్చింది...
దేశంలో బంగారం ధరలు మండిపోతున్నాయి. రికార్డ్ స్థాయికి బంగారం ధర చేరింది. తులం బంగారం రూ. 50 వేలు దాటితేనే వామ్మో అనుకున్న రోజుల నుంచి ఇప్పుడు ఏకంగా రూ. 60 వేలు దాటేసి రూ. 62 వేలకు చేరువైంది. ఇక శనివారం బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడిందని సంతోషించేలోపే ఆదివారం మళ్లీ పెరిగి షాక్ ఇచ్చింది. ఆదివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఆదివారం నమోదైన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,150 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,350 వద్ద నమోదైంది.
* ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ. 61,800 వద్ద ఉంది.
* ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 56,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,950 ఉంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,800 ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ. 56,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 61,850 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
* విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,800 ఉంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,500, ముంబైలో రూ. 74,800, ఢిల్లీలో రూ.77,600, కోల్‌కతాలో కిలో వెండి రూ.74,800, బెంగళూరులో రూ. 78,500, హైదరాబాద్‌లో రూ. 78,500, విజయవాడలో రూ. 78,700 విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..