Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ ఫుడ్స్ తిన్నారంటే లైంగిక శక్తి రెట్టింపు కావడం ఖాయం.. ఫలితాలు చూశాక ఆశ్చర్యపోవాల్సిందే..

Health Tips: మనలో చాలా మందికి ఉద్యోగ, వైవాహిక బాధ్యతల నడుమ కుటుంబంతో గడిపే సమయం కూడా దొరకడంలేదు. ఈ నేపథ్యంలోనే మానసిక, శారీరక ఒత్తిడి కారణంగా కొందరిలో శృంగార సామర్థ్యం, లైంగిక కోరికలు క్షీనిస్తున్నాయని..

Health Tips: ఈ ఫుడ్స్ తిన్నారంటే లైంగిక శక్తి రెట్టింపు కావడం ఖాయం.. ఫలితాలు చూశాక ఆశ్చర్యపోవాల్సిందే..
Foods To Increase Libido
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 14, 2023 | 6:00 AM

Health Tips: మనలో చాలా మందికి ఉద్యోగ, వైవాహిక బాధ్యతల నడుమ కుటుంబంతో గడిపే సమయం  కూడా దొరకడంలేదు. ఈ నేపథ్యంలోనే మానసిక, శారీరక ఒత్తిడి కారణంగా కొందరిలో శృంగార సామర్థ్యం, లైంగిక కోరికలు క్షీనిస్తున్నాయని అధ్యయనాలు, నివేదికలు చెబుతున్నాయి. ఇలా కోరికలు నశించడం వల్ల పిల్లలు పుట్టకపోవడమే కాక.. చివరికి విడాకులకు దారి తీసే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని రకాల ఆహారపు అలవాట్లను అలవరచుకుంటే లైంగిక శక్తి రెట్టిస్తుందని నిపుణులు చెబుతుతున్నారు. ఈ విషయంపై పోషకాహార నిపుణులు కూడా.. మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా లైంగిక సామర్థ్యం పెరుగుదలకు ఉపయోగపడతాయని వివరించారు. ఈ మేరకు కొన్ని రకాల ఆహార పదార్థాలు డైట్‌లో భాగంగా తీసుకోవాలని.. తద్వారా లైంగిక సామర్థ్యం పెరుగుతుందని వారు చెబుతున్నారు. మరి శృంగార సామర్థ్యం కోసం ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

అవకాడో: కామోద్దీపన పండుగా ప్రసిద్ధి చెందిన అవోకాడో పురుషులలో శృంగార సామర్థ్యం పంచేందుకు వరంలా పనిచేస్తుంది. చూడడానికి గుడ్డు ఆకారంలో ఉండే ఈ పండులో లైంగిక శక్తిని పెంచగల బీటా కెరోటిన్, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి మీలో లైంగిక కోరికలను కలగజేసి శృంగార సామర్య్థం పెరిగేలా చేస్తాయి.

దానిమ్మ: దానిమ్మలోని పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తప్పక తీసుకోవలసిన సూపర్ ఫ్రూట్. ఇది ఆరోగ్యానికే కాక లైంగిక శక్తిని పెంచే లక్షణాలను కూడా కలిగి ఉంది. కాబట్టి శృంగార సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని భావించేవారు తప్పకుండా దానిమ్మను తినాలంట.

ఇవి కూడా చదవండి

స్ట్రాబెర్రీలు: లైంగిక సామర్థ్యం పెంచే ఆహారాల్లో స్ట్రాబెర్రీలకు ప్రత్యేక స్థానం ఉంది. వీనస్ దేవతకు చిహ్నంగా సూచించే ఈ పండ్లలో సంతానోత్పత్తిని మెరుగుపరిచే విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని పెంచడంతో ఉపయోగకరంగా ఉంటాయి.

అత్తిపండ్లు: అంగస్తంభన లక్షణాలను నిరోధించేందుకు అత్తి పండ్లను దివ్యౌషధంగా పేర్కొంటారు ఆయుర్వేదికులు. పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యం, సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో అంజీర్ ఉపయోగకరంగా ఉంటుందని అనేక అధ్యయనాల్లోనూ రుజువైంది.

బీన్స్, తృణధాన్యాలు: సంతానోత్పత్తిని పెంచడంలో బీన్స్, తృణధాన్యాలు కూడా ఉపకరిస్తాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..