AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలోని పిల్లలకు ఎగ్ ఫ్రైడ్ రైస్ పంపిణీ.. ఫుడ్ మోనూలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం..

ఏపీలోని విద్యార్థులకు శుభవార్త. అంగన్‌వాడీల్లో అందించే ఫుడ్ మెనూలో మార్పులు జరిగాయి. ఇక నుంచి ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా అందించనున్నారు. అలాగే ఉడికించిన శనగలు కూడా అల్పాాహారంలో అందిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు

Andhra Pradesh: ఏపీలోని పిల్లలకు ఎగ్ ఫ్రైడ్ రైస్ పంపిణీ.. ఫుడ్ మోనూలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం..
Egg Fried Rice
Venkatrao Lella
|

Updated on: Mar 09, 2026 | 9:02 PM

Share

ఏపీలో అంగన్‌వాడీల్లో చేరే పిల్లలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి రోజువారీ అందిస్తున్న ఫుడ్ మోనూలో కీలక మార్పులు చేసింది. అంగన్‌వాడీ ద్వారా రాష్ట్రంలోని పిల్లలకు పౌషకాహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. పిల్లలు పోషకాహారలేమితో పిల్లలు బాధపడకుండా ఉండేందుకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఎగ్స్, పోషకాహార పౌడర్ వంటివి అందిస్తున్నారు. అయితే ఇప్పటినుంచి మరో రెండు పదార్థాలను కూడా మోనూలో చేర్చింది. పోషకాహార నిపుణుల సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పులిహోర అందిస్తుండగా.. దాని స్థానంలో మరో ఫుడ్ అందించేందుకు సిద్దమయ్యారు.

ఎగ్ ఫ్రైడ్ రైస్, శనగలు

ఏపీలోని అంగన్‌వాడీ పిల్లలకు శుభవార్త. ఇక నుంచి ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా వడ్డించనున్నారు. అలాగే ఉడికించిన శనగలు కూడా పెట్టనున్నారు. వారంలో రెండుసార్లు ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టనున్నారు. పులిహోర స్థానంలో వీటిని అందించనున్నారు. ప్రస్తుతం అంగన్వాడీల్లో వారానికి రెండుసార్లు పిల్లలకు పులిహోర పెడుతున్నారు. ఇప్పుడు దానికి బదులుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టనున్నారు. పిల్లలకు పోషకాహారంతో కూడిన ఆహారం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ రోజుల్లో బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఉడికించిన శనగలు పెట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక 7 నెలల నుంచి 36 నెలల మధ్య పిల్లలకు అందిస్తున్న బాలమృతం మెనూలో కూడా మార్పులు చేశారు.

జీతాల పెంపుపై త్వరలో నిర్ణయం

7 నుంచి 12 నెలల పిల్లలకు జూనియర్ బాలామృతం, 13 నెలల నుంచి 36 నెలల వారికి సీనియర్ బాలమృతం అందిస్తారు. వీరికి పోషకాహార పౌడర్ అందిస్తారు. త్వరలోనే వీటిని బాలామృతం కింద అందించనున్నారు. ఈ మేరకు టెండర్లను మహిళా శిశు సంక్షేమ శాఖ ఆహ్వానించనుంది. అటు అంగన్ వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆందోళనలు కూడా పలుమార్లు చేపట్టారు. దీనిపై తాజాగా మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. అంగన్ వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దీనిపై త్వరలోనే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇక ఆశా వర్కర్లు, వీఏవో డిమాండ్లను కూడా నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు.  అంగన్‌వాడీల సమస్యలపై వైసీపీ ప్రభుత్వం విడ్డూరంగా మాట్లాడుతుందన్నారు. శాసనమండలిలో వాకౌంట్ చేయడం సరికాదని లోకేష్ అన్నారు. అంగన్ వాడీ కార్యకర్తలకు జీతాల పెంపు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.

Follow Us
పసికందును బిడ్డకు అప్పజెప్పి పనికి వెళ్లిన తల్లిదండ్రులు..
పసికందును బిడ్డకు అప్పజెప్పి పనికి వెళ్లిన తల్లిదండ్రులు..
చెప్పుకోండి చూద్దాం.! మనుషులను చూసి సిగ్గుపడే జంతువు ఏదో తెల్సా..
చెప్పుకోండి చూద్దాం.! మనుషులను చూసి సిగ్గుపడే జంతువు ఏదో తెల్సా..
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే
మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!