ఖమ్మం గాంధీ నగర్‌కు చెందిన ప్రశాంతి, భర్త చాకంటి రవి పేరిట ఉన్న రూ. 66 లక్షల భీమా సొమ్ము కాజేసేందుకు కిరాతకంగా వ్యవహరించింది. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసి, కారుతో ఢీ కొట్టించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. పోలీసుల విచారణలో హత్య చేసినట్లు తేలగా, ప్రశాంతి సహా ఐదుగురిని అరెస్టు చేశారు.