Sun Worship Benefits: సూర్యోదయ సమయంలో సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

ప్రతిరోజూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం సాధకుడి జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం. అంతే కాకుండా సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల శారీరక వ్యాధులు దరిచేరవని విశ్వాసం. ఈ రోజు ప్రతి రోజూ  సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..  

Sun Worship Benefits: సూర్యోదయ సమయంలో సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
Surya Arghya
Follow us

|

Updated on: May 12, 2023 | 10:12 AM

హిందూ మతంలో ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి విశిష్ట స్థానం ఉంది. సూర్యుడికి నీటిని సమర్పించడం చాలా పవిత్రమైనది.. ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది. సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం పుణ్యప్రదమని నమ్ముతారు. మతపరమైన, ఆధ్యాత్మిక దృక్కోణంతో పాటు, అర్ఘ్యం  ప్రాముఖ్యత మానసిక దృక్కోణంలో కూడా చెప్పబడింది. ప్రతిరోజూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం సాధకుడి జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం. అంతే కాకుండా సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల శారీరక వ్యాధులు దరిచేరవని విశ్వాసం. ఈ రోజు ప్రతి రోజూ  సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

  1. హిందూమతంలో సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం.. సూర్య భగవానుడి పట్ల భక్తి, కృతజ్ఞతలకు చిహ్నం అని  పరిగణించబడుతుంది. అదే సమయంలో శాస్త్రీయ దృక్కోణంలో శరీరం సూర్యరశ్మి నుండి విటమిన్ డిని కూడా పొందుతుంది.
  2. సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించే సమయంలో చేయి దోసిలి పడతారు. ఇది వినయం, అంకితభావం,  దీవెనలు పొందేందుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. వినయం ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించడానికి దారితీస్తుందని నమ్ముతారు.
  3. సూర్యోదయం సమయంలో సూర్యరశ్మి శరీరానికి తగలడం వలన ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. హిందూ  మత విశ్వాసం ప్రకారం ప్రతిరోజూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వలన ఆ వ్యక్తి శరీరం వ్యాధి రహితంగా ఉంటుంది. ఇలా చేసే వారు త్వరగా వ్యాధుల బారిన పడరు.  .
  4. హిందూ సంప్రదాయంలో నీటిని శుద్ధి చేసే అంశంగా పరిగణిస్తారు. అర్ఘ్య సమర్పణ ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా శుద్ధి చేస్తుందని నమ్ముతారు. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. స్వచ్ఛత పొందిన  అనుభూతిని పెంచుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సూర్యుడు దైవిక శక్తి, కాంతి , జీవితానికి చిహ్నంగా పరిగణించబడ్డాడు. భూమిపై జీవితాన్ని కొనసాగించడంలో సూర్యుడు ముఖ్యమైన పాత్ర పోషిస్తాడని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో, అర్ఘ్యను సమర్పించి తద్వారా సూర్యుడికి కృతజ్ఞతలు తెలిపే మార్గంగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్