Astro Tips: సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వెనుక శాస్త్ర విశిష్టత.. ప్రయోజనం ఏమిటంటే..?

ధార్మిక నియమాలను పాటించడం వల్ల మనిషి జీవితంలో సుఖ సంతోషాలు మాత్రమే కాదు.. ఆ ఇంట్లోని వారి పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం శుభపరిణామమని మనం తరచుగా వింటుంటాం. దీపానికి హిందూ మతపరమైన ప్రాముఖ్యత ఉంది.

Astro Tips: సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వెనుక శాస్త్ర విశిష్టత.. ప్రయోజనం ఏమిటంటే..?
Astro Tips
Follow us
Surya Kala

|

Updated on: May 12, 2023 | 9:43 AM

మన జీవన విధానంలో అనేక నియమాలు సనాతన ధర్మంలో పేర్కొన్నారు. ఏ వ్యక్తి అయినా వీటిని అనుసరిస్తూ సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయంలో చేసే చర్యలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ ధార్మిక నియమాలను పాటించడం వల్ల మనిషి జీవితంలో సుఖ సంతోషాలు మాత్రమే కాదు.. ఆ ఇంట్లోని వారి పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం శుభపరిణామమని మనం తరచుగా వింటుంటాం. దీపానికి హిందూ మతపరమైన ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు ఇలా దీపం వెలిగించడం వెనుక శాస్త్రీయ దృక్కోణంలో కూడా అనేక  ప్రయోజనాలున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..

లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందని విశ్వాసం.. 

హిందూ మత విశ్వాసాల ప్రకారం.. సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని.. లక్ష్మీదేవి సాయంత్రం ఇంటికి చేరుకుంటుంది. దీంతో ఆ ఇంట్లోని వ్యక్తి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

రాహువు ప్రభావం తగ్గుతుందని.. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రోజూ సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించే ఇంట్లో.. ఎవరి జాతకంలోనైనా రాహువు అశుభ ప్రభావం ఉంటే తగ్గుతుంది. ఇంట్లో సానుకూల శక్తి కూడా వస్తుంది. ఇంటి నుండి ప్రతికూల శక్తులు దూరం అవుతాయి.

పేదరికం దూరమవుతుంది..

ఇంటి ప్రధాన ద్వారం వద్ద సాయంత్రం దీపం వెలిగిస్తే దరిద్రం రాదు. సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతేకాదు వ్యాధుల నుండి విముక్తి పొందుతారు.

శాస్త్రీయ కారణం ఏమిటంటే..

శాస్త్రజ్ఞుల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద క్రమం తప్పకుండా దీపం వెలిగించడం వలన ఇంటి వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది. కొన్ని రకాల పురుగుల ఉధృతి సాయంత్రం వేళల్లోనే ఎక్కువగా ఉంటుంది. కీటకాలు కాంతికి ఆకర్షితులవుతాయి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం ఉంటే ఇంట్లోకి పురుగులు, క్రిమి కీటకాలు రావు. హిందూ పురాణాల గ్రంథాల ప్రకారం.. ప్రధాన ద్వారానికి కుడి వైపున దీపం ఉంచడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. దీపాన్ని నెయ్యి లేదా నూనెతో వెలిగించాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).