Tirumala: ఏడాదిలోపు పిల్లలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం చాలా ఈజీ.. కండిషన్స్ అప్లై.. ఫుల్ డీటైల్స్ మీకోసం

స్వామివారి దర్శనం కోసం వచ్చే వృద్ధులు, శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్నవారు, ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులు గంటలు గంటలు ఎదురుచూడాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వీరి  ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న టీటీడీ దర్శనం విషయంలో ప్రాధాన్యం కల్పిస్తోంది.  ఏడాదిలోపు పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఉచితంగా.. అది కూడా ప్రత్యేక దర్శన భాగ్యం కల్పిస్తోంది టీటీడీ.

Tirumala: ఏడాదిలోపు పిల్లలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం చాలా ఈజీ.. కండిషన్స్ అప్లై.. ఫుల్ డీటైల్స్ మీకోసం
Tirumala Tirupati
Follow us

|

Updated on: May 11, 2023 | 12:06 PM

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో నిండి ఉంటుంది. శ్రీవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు.. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. శ్రీవారిని దర్శించుకునేందుకు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ సర్వ దర్శనం, దివ్య దర్శనం, శ్రీవాణి ట్రస్ట్‌ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం,  సుపథ దర్శనం వంటి అనేక దర్శనాల ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకునే వీలుకల్పిస్తోంది టీటీడీ.  స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఉచిత దర్శనం, అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తోంది.

స్వామివారి దర్శనం కోసం వచ్చే వృద్ధులు, శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్నవారు, ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులు గంటలు గంటలు ఎదురుచూడాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వీరి  ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న టీటీడీ దర్శనం విషయంలో ప్రాధాన్యం కల్పిస్తోంది.  ఏడాదిలోపు పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఉచితంగా.. అది కూడా ప్రత్యేక దర్శన భాగ్యం కల్పిస్తోంది టీటీడీ. దీంతో ఏడాది లోపు పిల్లలతో తల్లిదండ్రులు స్వామివారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండక్కర్లేదు.  నేరుగా దర్శానానికి పంపిస్తారు. దర్శనం కోసం కొన్ని నియమ, నిబంధలు ఉన్నాయి. అవి ఏమిటంటే..

ఇవి కూడా చదవండి

ఏడాదిలోపు వయసున్న చిన్నారులు స్వామివారి ఉచిత దర్శనం కోసం వెళ్లే తల్లిదండ్రులు పిల్లల ఒరిజనల్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే.. చిన్నారిని ఆస్పత్రి నుంచి ఇచ్చే డిశ్చార్జ్ చేసిన సర్టిఫికెట్ ను ఇవ్వాల్సి ఉంటుంది. ఒరిజినల్స్ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళాలి. అంతేకాదు.. తల్లిదండ్రుల ఐడీ కార్డులు (ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ వంటివి) కచ్చితంగా తీసుకుని వెళ్ళాలి.

ఈ ప్రత్యేక దర్శనానికి ఏడాదిలోపు బాచిన్నారితో పాటూ తల్లిదండ్రులకు అనుమతినిస్తారు. అంతేకాదు వీరితో పాటు.. 12 ఏళ్ల లోపు బాలిక లేదా బాలుడికి కూడా అనుమతిస్తారు. ఈ దర్శనం కోసం భక్తులు ముందుగా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి రుసుము  చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఈ దర్శనాన్ని  ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుపథం నుంచి నేరుగా శ్రీవారి దర్శనం చేసుకునే అనుమతిస్తారు.

సుపథం మార్గం దగ్గర పిల్లల బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రులు ఐడీ ప్రూఫ్స్‌ను టీటీడీ సిబ్బంది పరిశీలించి తర్వాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు. అయితే ఈ దర్శనానికి వెళ్లే తల్లిదండ్రులు, పిల్లలు కూడా సంప్రదాయ దుస్తుల్లోనే వెళ్లాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు