AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips For Own House: సొంత ఇల్లు కల నెరవేర్చుకోవాలా.. అయితే ఈ చర్యలు పాటించి చూడండి..

కొందరు ఎంత ప్రయత్నించినప్పటికీ.. సొంత ఇల్లు నిర్మించుకోలేరు. సొంత ఇల్లుని కొనడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా విఫలం అవుతూ ఉంటారు. అలాంటి వారు జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న కొన్ని చర్యలు పాటిస్తే.. సొంత ఇల్లు కల నెరవేరే దిశగా అడుగులు వేస్తారు.

Astro Tips For Own House: సొంత ఇల్లు కల నెరవేర్చుకోవాలా.. అయితే ఈ చర్యలు పాటించి చూడండి..
Astrology Tips To Own Dream
Surya Kala
|

Updated on: May 11, 2023 | 9:11 AM

Share

ప్రతి వ్యక్తి కల సొంత ఇల్లు.. చిన్నదో పెద్దదో తమ స్థాయికి తగినల్టు ఓ సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ కల తీరేది కొందరికే.. అలా కలల ఇంటిని సొంతం చేసుకోవడానికి జ్యోతిష శాస్త్రంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. అద్దె ఇంట్లో నివసిస్తుంటే.. ఎవరైనా సరే చాలా కష్టపడతారు. ఎంత ప్రయత్నించినప్పటికీ.. సొంత ఇల్లు నిర్మించుకోలేరు. సొంత ఇల్లుని కొనడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా విఫలం అవుతూ ఉంటారు. అలాంటి వారు జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న కొన్ని చర్యలు పాటిస్తే.. సొంత ఇల్లు కల నెరవేరే దిశగా అడుగులు వేస్తారు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

  1. ఏ శుక్రవారమైనా 3 కొబ్బరికాయలు తీసుకుని ఇంట్లో పెట్టుకోండి. మర్నాడు.. అంటే శనివారం ఉదయాన్నే ఈ 3 కొబ్బరికాయలలో ఒకదాన్ని తీసుకుని ఏదైనా శివాలయంలో శివయ్యకు సమర్పించండి. అదేవిధంగా అదే శివాలయంలో శివునికి ఆదివారం రెండవ కొబ్బరికాయను, సోమవారం మూడవ కొబ్బరికాయను సమర్పించండి.
  2. శివలింగానికి జలాభిషేకం చేయండి. ఈ  మూడు కొబ్బరికాయలను ఒకే శివాలయంలో సమర్పించాలని గుర్తుంచుకోండి.
  3. అనంతరం క్రమం తప్పకుండా ప్రతి సోమవారం ఏదైనా శివాలయంలో శివునికి ఒక కొబ్బరికాయను సమర్పించే ప్రక్రియను కొనసాగించండి.
  4. ఇలా చేయడం ద్వారా సమస్యలు తీరడం ప్రారంభమవుతాయి. అంతేకాదు మనసులో కోరిన కోరికలు కూడా నెరవేరతాయి. ఇలా కనీసం ఆరునెలలు చేయాల్సి ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. కొత్త ఇంటిని నిర్మించాలనుకునేవారు.. శుభ సమయంలో ఇంటికి పునాదిని వేసుకోండి. పునాది వేసే సమయంలో వెండి పాములు, రాగి డబ్బు, రాగి పాత్ర , మూత మొదలైన వాటిని శంకుస్థాపన సమయంలో వేయాలి. అనంతరం ఇంటిని ప్రారంభించండి. పునాదిలో వేసిన వాటిని తిరిగి తీసుకోవద్దు.
  7. ఫౌండేషన్‌లో సమయంలో శ్రీ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోండి. తద్వారా ఆ ఇంట్లో నివసించే వారు ఎల్లప్పుడూ భగవంతుని అనుగ్రహాన్ని కలిగి ఉంటారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడదు.
  8. అయితే తయారుగా ఉన్న ఇల్లును కొంగలు చేస్తే.. ఇంటి ప్రధాన ద్వారం వెలుపల గణపతి విగ్రహాన్ని (రాగి, ఇత్తడి, పంచధాతు, అష్టధాతు మొదలైనవి) ఉంచండి. అయితే ఈ వినాయక విగ్రహానికి తొండం కుడివైపుకు తిరిగి ఉండాలని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వలన అదృష్టం ఆ కుటుంబ సభ్యుల సొంతం అని విశ్వాసం.
  9. చాలా మంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద ముడు కోణాలు ఉన్న మంగళ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోండి. ఈ యంత్రంతో పాటు.. ఇంటి మెయిన్ డోర్ బయట కూడా చిన్న చిన్న గంటలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).