- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti these incidents give big lessons of life in telugu
Chanakya Niti: ఈ సంఘటనలు జీవితంలో గొప్ప పాఠాలను ఇవ్వడమే కాదు.. భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుంది
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మానవ జీవన విధానాలలో దాదాపు అన్ని రంగాల గురించి ప్రస్తావించారు. అతని మాటలు , విధానాలు నేటి సమాజంలో కూడా సంబంధితంగా పరిగణించబడుతున్నాయి. జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఏదో ఒక పాఠాన్ని ఇస్తుందని చాణక్యుడు నమ్మాడు.
Updated on: May 08, 2023 | 1:35 PM

ప్రేమ- ఆప్యాయత: పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తించేలా తల్లిదండ్రులు స్వేచ్ఛనివ్వరాదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. పిల్లలు తప్పు చేస్తే.. తల్లిదండ్రులు అప్పుడే వారిని మందలించాలి. వారికి తప్పు ఒప్పుల గురించి అర్థం చేసుకునేలా వివరించాలి.

ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మానవులకు సంబంధించిన అనేక సమస్యలను ప్రస్తావించాడు. అలాగే వాటికి సంబంధించిన పరిష్కారాల గురించి చెప్పాడు. చాణక్యుడు ప్రకారం తనకు తెలియకుండానే వ్యక్తి చేసే తప్పులు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనిషి పాటించాల్సిన కొన్ని విషయాలను చెప్పాడు.

మూర్ఖులు: మూర్ఖులతో సహవాసం హానికరమని చాణక్యుడు వివరించాడు. వివేకం లేని వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్యుడు సలహా ఇచ్చాడు. మూర్ఖులు తీసుకునే చెడు నిర్ణయాలు మీపై ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులతో మీరు స్నేహం చేయండి.

చాణక్యుడు ప్రకారం మూర్ఖులు, ద్రోహులను గౌరవించే చోట లక్ష్మీదేవి నివసించదు. మూర్ఖుల మాటలు వినేవాడు జీవితంలో ఎప్పుడూ నష్టపోవాల్సి వస్తుందని చాణక్యుడు నమ్మాడు. మీరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే మీరు తీసుకున్న నిర్ణయాన్ని విశ్వసించండి.

అదృష్టం మీద ఆధారపడకుండా కష్టపడి పనిచేసే వ్యక్తికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. అలాంటి వారి జీవితంలో డబ్బుకు లోటు అనేది కలగదు. అంతే కాకుండా జీవితంలో సుఖ సంపదలు లభిస్తాయి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కష్టపడి పనిచేసే వారు త్వరగా విజయం సాధిస్తారని చాణక్యుడు నమ్మాడు.




