Tirumala: ఆనంద నిలయ దృశ్యాలను ఓ మహిళ షూట్ చేసినట్లు గుర్తింపు.. భక్తురాలి వివరాలను సేకరించే పనిలో టీటీడీ

తిరుమల ఆలయ ఆనంద నిలయం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం రాత్రి వర్షం పడుతున్న సమయంలో శ్రీవారి ఆనంద నిలయాన్ని ఓ భక్తుడు మొబైల్ ఫోన్ లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆలయంలోకి మొబైల్స్ ఫోన్స్, కెమెరాలు, కొన్ని రకాల ఎలక్రికల్ వస్తులు తీసుకెళ్లడంపై నిషేధం ఉండడంతో.. ఇప్పుడు శ్రీవారి ఆలయంలోకి మొబైల్ తో ఎలా ప్రవేశించారనేది ప్రశ్నలకు దారితీసింది. 

Follow us
Surya Kala

|

Updated on: May 08, 2023 | 1:44 PM

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆలయంలో భద్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది. తిరుమల ఆలయ ఆనంద నిలయం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం రాత్రి వర్షం పడుతున్న సమయంలో శ్రీవారి ఆనంద నిలయాన్ని ఓ భక్తుడు మొబైల్ ఫోన్ లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆలయంలోకి మొబైల్స్ ఫోన్స్, కెమెరాలు, కొన్ని రకాల ఎలక్రికల్ వస్తులు తీసుకెళ్లడంపై నిషేధం ఉండడంతో.. ఇప్పుడు శ్రీవారి ఆలయంలోకి మొబైల్ తో ఎలా ప్రవేశించారనేది ప్రశ్నలకు దారితీసింది.

వెంటనే అప్రమత్తమైన టీటీడీ టిటిడి విజిలెన్స్ విభాగం భక్తుడు సెల్ ఫోన్ తో ఆలయంలోకి ఎలా ప్రవేశించారన్న విషయంపై ఆరాతీస్తున్నారు. ఆనంద నిలయం పై దర్శనమిచ్చే విమాన వెంకటేశ్వర స్వామిని భక్తులు మొక్కే ప్రాంతం నుంచి అజ్ఞాత భక్తుడు వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చర్చగా మారిన అంశంగా మారింది. ఈ వీడియో ఎలా సోషల్ మీడియాలోకి వచ్చింది అనే విషయంపై టీటీడీ విజిలెన్స్, పోలీస్ యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించారు. మొబైల్ తో వెళ్లిన భక్తుడు ఆచూకీ తెలుసుకునేందుకు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.

అయితే నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో ఎలా సెల్ ఫోన్ తీసుకుని వెళ్లారంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు శ్రీవారి ఆలయంలో సెల్ ఫోన్ ను తీసుకుని వెళ్తున్నా గుర్తించలేని విజిలెన్స్ యంత్రాంగం.. సెక్యూరిటీ సిబ్బంది అంటూ మండి పడుతున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అజ్ఞాత భక్తురాలిని గురించే పనిలో టీటీడీ 

ఆనంద నిలయ దృశ్యాలను చిత్రికరించిన వారిని గుర్తించేందుకు టీటీడీ సిబ్బంది సీసీ ఫుటేజి పరిశీలనలో విస్తుబోయే నిజం వెలుగులోకి వచ్చింది. ఆలయ దృశ్యాలను ఓ మహిళ చిత్రికరించినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అంతేకాదు శ్రీవారి ఆనంద నిలయ దృశ్యాలనును మొబైల్ ఫోన్ తో కాకుండా సి కెమె కెమెరాతో చిత్రికరించినట్లు తెలుస్తోంది. మహిళా భక్తురాలి వివరాలను విజిలెన్స్ అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. ఆ మహిళా భక్తురాలు పై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. సీక్రెట్ కెమెరా తో చిత్రికరించినట్లు తేలితే మహిళా భక్తురాలను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకోనున్నట్లు సమాచారం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..