Vastu Tips for Home: ఇంటి నిర్మాణంలో ఈశాన్య దిశకు ప్రాముఖ్యత.. ఈ వస్తువులంటే ఇంట్లోవారికి వ్యాధులే

ఈశాన్యం ఎక్కువగా ఉన్న ఇంటిలో నివసించే వారికి సుఖ సంతోషాలు, విద్య, ఆర్ధిక లాభాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతారు. అందుకనే ఎక్కువగా ఇంట్లో ఈశాన్యం దిక్కున పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు. అంతేకాదు ఈశాన్య దిక్కులో ఉదయం సూర్యరశ్మి  పడుతుంది.

Vastu Tips for Home: ఇంటి నిర్మాణంలో ఈశాన్య దిశకు ప్రాముఖ్యత.. ఈ వస్తువులంటే ఇంట్లోవారికి వ్యాధులే
Northeast Direction
Follow us
Surya Kala

|

Updated on: May 13, 2023 | 10:49 AM

వాస్తు శాస్త్రంలో ఎనిమిది దిక్కులున్నాయి.. తూర్పు, ఉత్తరం మధ్యన ఉన్న దిక్కుని ఈశాన్యం అని అంటారు. ఈ ఈశాన్య దిక్కు ప్రత్యేకమైంది.. వాస్తు శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఇంటిని నిర్మించే సమయంలో ఈ దిక్కు విషయంలో ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటారు. ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిదని.. శుభఫలితాలుంటాయని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. ఈశాన్యం ఎక్కువగా ఉన్న ఇంటిలో నివసించే వారికి సుఖ సంతోషాలు, విద్య, ఆర్ధిక లాభాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతారు. అందుకనే ఎక్కువగా ఇంట్లో ఈశాన్యం దిక్కున పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు. అంతేకాదు ఈశాన్య దిక్కులో ఉదయం సూర్యరశ్మి  పడుతుంది. ఈ కిరణాలు అనారోగ్యాన్ని నయం చేసే శక్తి ఉంటుందని విశ్వాసం అయితే ఇంట్లో ఈశాన్య దిశలో కొన్నిటిని పెట్టుకోవడం వలన ఇబ్బందులు మాత్రమే కాదు.. అనారోగ్యం బారిన పడతారు. ఈరోజు ఇంట్లో ఈశాన్య దిక్కులో ఉండకూడనివి ఏమిటో తెలుసుకుందాం..

  1. ఈశాన్య దిక్కులో ఎప్పుడూ బరువైన వస్తువులు పెట్టకూడదు. అంతేకాదు అపరిశుభ్రంగా ఉంటే రోగాల బారిన పడతారు. చేపట్టిన పనిలో ఇబ్బందులు ఎదురవుతాయి.
  2.  ఈశాన్య దిశలో టాయిలెట్ నిర్మాణం నిషేధం.. ఇలా ఈశాన్య దిక్కులో మరుగు దొడ్డి ఉంటె.. ఆ ఇంట్లోనివారు ఎప్పుడూ వ్యాధులబారిన పడుతూనే ఉంటారు.
  3. ఈశాన్య దిక్కులో వంట గదిని నిర్మించకూడాదు. ఈ దిక్కులో వంట చేసుకోవడం అనారోగ్యానికి కారణం అవుతుంది.
  4. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య మూలను మూసివేస్తూ ఎటువంటి నిర్మాణం చేపట్టకూడదు.  బెడ్ రూమ్ ఉండకూడదు.
  5. ఇవి కూడా చదవండి
  6. ఈశాన్య దిశలో లోపల గానీ, బయట గానీ మెట్లు ఉండరాదు. అంతేకాదు చెప్పులు విడవ కూడదు.
  7. అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈశాన్య దిక్కుని దృష్టిలో పెట్టుని ఇంటిని నిర్మించుకోవాలి. లేకుండా అనేక కష్టనష్టాలు, వ్యాధుల బారిన పడే అవకాశం ఉందనివాస్తుశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).