Sri Krishna Temple: మీరాతో కలిసి నివసించే శ్రీకృష్ణుడు.. ప్రపంచంలో ఏకైక ఆలయం.. రోజు సాయత్రం కన్నయ్య వస్తాడని విశ్వాసం..

శ్రీకృష్ణుడు ప్రతి రాత్రి ఈ ఆలయాన్ని సందర్శిస్తాడని నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలో రోజూ పూజలు జరుగుతాయి. రాత్రిపూట గుడి తలుపులు మూసివేస్తారు. ఆలయాన్ని మూసివేసే ముందు, విగ్రహాల ముందు నిద్రించడానికి ఏర్పాటు చేస్తారు, మంచం, నీటితో నిండిన గాజును ఉంచుతారు.

Sri Krishna Temple: మీరాతో కలిసి నివసించే శ్రీకృష్ణుడు.. ప్రపంచంలో ఏకైక ఆలయం.. రోజు సాయత్రం కన్నయ్య వస్తాడని విశ్వాసం..
Brij Raj Swami Temple
Follow us
Surya Kala

|

Updated on: May 13, 2023 | 12:37 PM

హిమాచల్ ప్రదేశ్‌లో పురాతనమైన చరిత్ర కలిగిన అనేక దేవాలయాలతో పాటు రహస్యాలను దాచుకున్న అనేక ఆలయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ నూర్‌పూర్‌లోని పురాతన కోట పరిసరాల్లో ఉన్న శ్రీ బ్రిజ్‌రాజ్ స్వామి జీ ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ శ్రీకృష్ణుడు తన ప్రియసఖి రాధతో కాకుండా మీరాబాయితో కలిసి భక్తులతో పూజలను అందుకుంటున్నారు. దీంతో శ్రీకృష్ణుడు, మీరాబాయి కలిసి ఉన్న ప్రపంచంలోని ఏకైక ఆలయం ఇదే. ఈ రెండు విగ్రహాలు చాలా అతీంద్రియ శక్తులు కలిగి ఉన్నాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు కృష్ణ, మీరా విగ్రహాలు చూపరులకు కనులవిందు చేస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇక్కడ కృష్ణుడిని దర్శించుకుంటే చాలు భక్తులు కోరిన కోరికలు నెరవేరతాయని నమ్మకం. శ్రీకృష్ణుడు స్వయంగా మీ ముందు నిలబడి ఉన్నట్లుగా విగ్రహాలు తయారు చేయబడ్డాయి. జన్మాష్టమి రోజున ఈ దేవాలయంలోని కృష్ణుడు అతీంద్రియ శక్తి,  అందం పెరుగుతుందని స్థానికులు చెబుతారు.

ఆలయ చరిత్ర క్రీ.శ 1629 నుండి 1623 వరకు చిత్తోర్‌గఢ్ ను పాలించిన రాజు ఆహ్వానంపై నూర్‌పూర్ రాజా జగత్ సింగ్ తన రాజ్ పురోహితుడితో కలిసి కోతకు చేరుకున్నాడు. రాజా జగత్ సింగ్ , అతని పూజారులు రాజభవనంలో  రాత్రి విశ్రాంతి కోసం బస చేచేశారు. ఈ రాజభవనం పక్కనే ఒక ఆలయం ఉంది. అయితే జగత్ సింగ్ కు రాత్రి ఆ ఆలయం నుండి గజ్జెల శబ్దం, సంగీత శబ్దాలు వినిపించాయి. దీంతో జగత్ సింగ్ తాను బస చేసిన ప్యాలెస్ కిటికీలోంచి బయటకు చూసేసరికి..  ఆలయంలో ఒక స్త్రీ శ్రీకృష్ణుని విగ్రహం ముందు భజనలు పాడుతూ నృత్యం చేస్తోంది. ఆ ఆలయంలో శ్రీ కృష్ణుడు , మీరా విగ్రహాలు ఉన్నాయి. జగత్ సింగ్ తన పూజారులకు విషయం మొత్తం చెప్పాడు. అంతేకాదు చిత్తోర్‌గఢ్ నుంచి తిరిగి  నూర్‌పూర్వ వెళ్లే సమయంలో తనకు శ్రీకృష్ణుడు, మీరా విగ్రహాలను బహుమతిగా ఇవ్వ్వమని అడిగాడు. చిత్తోర్‌గఢ్ రాజు సంతోషంగా ఆ విగ్రహాలను అతనికి సమర్పించాడు. ఈ విగ్రహాలను తెచ్చిన నూర్పూర్ రాజు జగత్ సింగ్ తన ఆస్థానాన్ని దేవాలయంగా మార్చాడు. ఈ రెండు విగ్రహాలను అక్కడ ప్రతిష్టించాడు.

ఆలయానికి వచ్చే శ్రీ కృష్ణుడు శ్రీకృష్ణుడు ప్రతి రాత్రి ఈ ఆలయాన్ని సందర్శిస్తాడని నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలో రోజూ పూజలు జరుగుతాయి. రాత్రిపూట గుడి తలుపులు మూసివేస్తారు. ఆలయాన్ని మూసివేసే ముందు, విగ్రహాల ముందు నిద్రించడానికి ఏర్పాటు చేస్తారు, మంచం, నీటితో నిండిన గాజును ఉంచుతారు. ఉదయం గుడి తలుపు తెరిచిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసే మంచం మీద మడతలు ఉంటాయి. గ్లాసు నీరు కింద పది ఉంటుంది.  శ్రీ కృష్ణుడు, మీరాబాయి రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).