Andhra Pradesh: అవసరమైతే బయటకు రండి.. వీరు మాత్రం అస్సలు బయటకు రావొద్దు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు.సెగలుకక్కుతున్న సూర్యుడి ప్రతాపానికి బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. భానుడి భగభగలకు అల్లాడిపోతున్నారు. వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. ఇలాంటి సిచ్యూవేషన్‌లోనే తస్మాత్ జాగ్రత్త అంటూ కొత్త హెచ్చరికలు చేసింది విపత్తు నిర్వహణ సంస్థ.
సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచే భగ్గుమంటున్నాడు. ఫలితంగా బయట అడుగు వేస్తేనే.. నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టుగా అనిపిస్తోంది. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా.. వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. ఏపీలో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అధికంగా వుండనుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ వేసవిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ మూడురోజుల్లో నమోదయ్యే అవకాశాలున్నాయని… ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా వృద్దులు, గర్భిణులు, బాలింతలు మరింత జాగ్రత్తగా వుండాలని… అవసరం వుంటే తప్ప బయటకు వెళ్లరాదని సూచించారు.
- ఈరోజు విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.
- ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
- కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.
తస్మాత్ జాగ్రత్త అంటూ విపత్తుల సంస్థ హెచ్చరిక
- 127 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
- 173 మండలాల్లో వడగాల్పులు
- 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
- 190 మండలాల్లో వడగాల్పులు
- విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి
- కాకినాడ, కోనసీమ,ఉభయగోదావరి, ఏలూరు
- కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు
- 45°C – 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
- కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి
- 42°C – 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
ఎండలు, వడగాల్పులు తప్పవంటూ హెచ్చరిక
ఇవాళ 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 190 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. సోమవారం విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సూచించింది.
ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు మండిపోతుండగా తాజాగా విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎండల తీవ్రత అధికంగా వుండే జిల్లాలు, మండలాల అధికారులకు విపత్తుల సంస్థ పలు సూచనలు ఇచ్చింది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా అధికారులు హెచ్చరిస్తోంది. ఇక అటు తెలంగాణలోనూ ఎండలు దంచికొడుతున్నాయి. ఇటీవల వర్షాలు కురవడంతో ఎండల నుంచి ఊరట కలిగింది. ప్రస్తుతం వానలు తగ్గుముఖం పట్టడంతో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం