AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati Fire Mysteries: ఆ గ్రామంలో వింత సమస్య.. ఇళ్లు, పొలాల్లో మిస్టరీ మంటలు.. ఊరుని ఖాళీ చేస్తోన్న గ్రామస్థులు..

ఆ గ్రామంలోని పొలాల్లో గడ్డివాములు దగ్ధమవుతున్నాయి. ఇళ్లలోనూ అకస్మాత్తుగా మంటలు వ్యాపిస్తున్నాయి. అందులోనూ అన్నదమ్ములకు చెందిన ఇళ్లు, పొలాల్లోనే మంటలు చెలరేగుతుండటం ఆశ్యర్యం కలిగిస్తోంది. ఇదీ ప్రస్తుతం.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శానంబట్లలోని పరిస్థితి.

Tirupati Fire Mysteries: ఆ గ్రామంలో వింత సమస్య.. ఇళ్లు, పొలాల్లో మిస్టరీ మంటలు.. ఊరుని ఖాళీ చేస్తోన్న గ్రామస్థులు..
Mysterious Fires In Tirupat
Surya Kala
|

Updated on: May 14, 2023 | 7:03 AM

Share

తిరుపతి జిల్లాలోని ఓ గ్రామాన్ని వింత సమస్య వేధిస్తోంది. ఎలాంటి కారణాలు లేకుండానే గ్రామంలో ఉన్నట్టుండీ మంటలు చెలరేగుతుండటం మిస్టరీగా మారుతోంది. ఇంతకీ.. ఏంటీ మిస్టరీ మంటలు?.. ఆ గ్రామంలో అసలేం జరుగుతోంది?..అనే విషయంపై పోలీసులు, అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. అవును ఆ గ్రామంలోని పొలాల్లో గడ్డివాములు దగ్ధమవుతున్నాయి. ఇళ్లలోనూ అకస్మాత్తుగా మంటలు వ్యాపిస్తున్నాయి. అందులోనూ అన్నదమ్ములకు చెందిన ఇళ్లు, పొలాల్లోనే మంటలు చెలరేగుతుండటం ఆశ్యర్యం కలిగిస్తోంది. ఇదీ ప్రస్తుతం.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శానంబట్లలోని పరిస్థితి. గ్రామంలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం ఊరిలోని ఆరు గడ్డివాములు దగ్ధం కాగా.. మూడు రోజులుగా ఇళ్లలోని బీరువాల్లో సడెన్‌గా మంటలు చెలరేగుతున్నాయి. దాంతో.. శానంబట్ల గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఊరు ఖాళీ చేసి పక్క ఊరిలో తలదాచుకోవడానికి వెళ్తున్నారు కొందరు గ్రామస్తులు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు.. గ్రామానికి చేరుకుని ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అయితే.. అధికారులు ఉండగానే నాలుగు ఇళ్లలో మంటలు చెలరేగడంతో మిస్టరీ మరింత బలపడినట్లు అయింది. రంగంలోకి దిగిన ఫోరెన్సిక్, క్లూస్ టీమ్‌లు.. మంటలు వ్యాపించిన చోట శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. దాంతోపాటు.. డీఎస్పీ ఆదేశాలతో గ్రామంలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది.

మరోవైపు.. గ్రామానికి అరిష్టం జరిగిందంటూ పూజలు చేశారు గ్రామస్తులు. గ్రామంలో గంగమ్మ పూజలు నిర్వహించారు. అదేసమయంలో.. కొందరు గ్రామస్థులు మంత్రగాళ్లనూ ఆశ్రయించారు. అయితే.. ఓ మంత్రగాడు పూజలు చేస్తుండగానే.. సమీపంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో.. అప్పటికప్పుడు తాళం పగులగొట్టి మంటలను ఆర్పివేశారు. అగ్నిప్రమాదానికి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. కానీ.. బీరువాలో మంటలు అంటుకొని బట్టలు, బంగారు ఆభరణాలు కాలిపోయాయని గ్రామస్తులు చెప్తున్నారు. అటు.. గ్రామంలో టీడీపీ, వైసీపీ నేతలు పర్యటించి.. ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తంగా.. తిరుపతి జిల్లా శానంబట్లలోని మంటల మిస్టరీ ఎప్పుడు వీడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..