KTR: ప్రతిపక్షాలపై మరోసారి ఫైర్ అయిన మంత్రి కేటీఆర్.. మతం పిచ్చితో కాలిపోయే తెలంగాణ వద్దంటూ..
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. 'మనకు పచ్చని పంటల తెలంగాణ కావాలి, మతం పిచ్చితో కాలిపోయే తెలంగాణ వద్దు' అని అన్నారు. సోమవారం ఆదిభట్లలోని కొంగరకలాన్‌లో అంతర్జాతీయ సంస్థ ఫాక్స్ కాన్ పరిశ్రమకు భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి...

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ‘మనకు పచ్చని పంటల తెలంగాణ కావాలి, మతం పిచ్చితో కాలిపోయే తెలంగాణ వద్దు’ అని అన్నారు. సోమవారం ఆదిభట్లలోని కొంగరకలాన్‌లో అంతర్జాతీయ సంస్థ ఫాక్స్ కాన్ పరిశ్రమకు భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 100 సీట్లు గెలుస్తాం అన్న కసితో పనిచేయాలని నాయకులు, కార్యకర్తదర్శలకు దిశానిర్ధేశం చేశారు. హ్యాట్రిక్ సాధిస్తున్నామని కేడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేశారు మంత్రి.
మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ‘ఒక పార్టీ మత పిచ్చి పార్టీ అది కులగోడుదాం ఇది కులగోడుదాం అనడం తప్ప వేరే ఏం లేదు. మోడీ పెట్టె ఇబ్బందులు తట్టుకొని కంపెనీలు తెలంగాణకు తేవడం చాల కష్టంగా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న ఒక పార్టీ నిరుద్యోగ మార్చ్ అంటోంది. మరో పార్టీ పార్టీ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ తిరుగుతోంది. దశాబ్దాలుగా పని చేయని వారు ఈరోజు ఒక్క ఛాన్స్ అంటున్నారు. మోడీ చెప్పినట్లు రెండు కోట్ల ఉద్యోగాలు వస్తే ఈ మార్చ్ ఎందుకు.? మీ నిరుద్యోగ మార్చ్ మోడీ పైన చేస్తున్నారా.? టీఎస్‌పీఎస్సీలో చొరబడి పేపర్ లీక్ చేసింది ఈ దొంగలే. కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేకే పేపర్ లీక్ చేస్తున్నారు’ అని మండి పడ్డారు మంత్రి కేటీఆర్.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..