తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు.. 25 వేల మందికి ఉద్యోగాలు. భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్
అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తూ, కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్న హైదరాబాద్ మహా నగరంలో మరో భారీ పెట్టుబడులకు కేంద్రం కానుంది. ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫాక్స్ కాన్ కంపెనీ ఆదిభట్ల పరిధిలోని కొంగరకలాన్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. సుమారు 196 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ...

అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తూ, కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్న హైదరాబాద్ మహా నగరంలో మరో భారీ పెట్టుబడులకు కేంద్రం కానుంది. ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫాక్స్ కాన్ కంపెనీ ఆదిభట్ల పరిధిలోని కొంగరకలాన్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. సుమారు 196 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ భూమి పూజ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఇక ఈ సంస్థ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలు మోడల్స్‌కి చెందిన సెల్ ఫోన్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 25 వేల మందికి పరోక్షంగా మరెంతో మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
భూమి పూజ అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. ఫాక్స్ కాన్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ లో పెట్టుబట్టి పెట్టినందుకు ఫాక్స్ కాన్ సంస్థకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది కంపెనీ కార్యాలపాలు పార్రంభమవుతాయని ప్రభుత్వం నుంచి ఫాక్స్ కాన్‌కు అన్ని సహకారాలు అందుతాయని మంత్రి తెలిపారు. ఈ పరిశ్రమ తెలంగాణకు ఒక ల్యాండ్ మార్క్ అవుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.




ఇదిల కేవలం ప్రారంభం మాత్రమే అన్న కేటీఆర్.. గడచిన తొమ్మిదేళ్లలో ఇండస్ట్రీ రంగంలో ఏంతో అభివృద్ధి చెందామని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రం ఐటీలో రెండో స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు మంత్రి. ఈ రోజు చారిత్రాత్మక రోజని అభివర్ణించిన కేసీఆర్, ఫ్యాక్స్ కాన్ తో ఒప్పందం చేసుకున్న రెండు నెలలోల్లోనే భూమి పూజ చేసుకున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 23 లక్షల ఉద్యోగాలు సృష్టించామని చెప్పుకొచ్చారు.
Demonstrating the “Telangana Speed”, I am happy to announce the groundbreaking of first of Foxconn’s plants in Telangana at Kongar Kalaan today
With an investment of over $500M it shall create 25,000 direct jobs in first Phase #Telangana #Foxconn pic.twitter.com/PHThJWxsfT
— KTR (@KTRBRS) May 15, 2023
ఉపాధి కల్పన పెద్ద సవాల్: కేటీఆర్
ఉపాధి కల్పన అనేది ప్రతి ప్రభుత్వం మీద ఉన్న పెద్ద సవాల్ అన్న కేటీఆర్.. జనాభా మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదన్నారు. మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించడం కోసమే విదేశీ పర్యటనలు చేసి కంపెనీలు తీసుకొస్తున్నామన్నారు కేటీఆర్. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హైద్రబాద్ నగరం అభివృద్ధి పై మాట్లాడారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ భూమి పూజా కార్యక్రామానికి కేటీఆర్‌తో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..