Watch: అయ్యో రామా..! పసిడితో ప్రయోగాలనుకుంటే ఇంకేదో అయిపాయే.. అంత బంగారాన్ని చేతులారా..

సైన్స్ అభిమాని తన చేతిలో 100-గ్రాముల స్వచ్ఛమైన బంగారు బిస్కెట్‌ని పట్టుకుని ప్రయోగం మొదలు పెట్టాడు. అయితే, ఇక్కడ ప్రయోగానికి ఉపయోగించిన స్వచ్ఛమైన బంగారం ధర విలువ అక్షరాల రూ.6.30 లక్షలు అని తెలిసింది. అతను ముందుగా ఒక గాజు గ్లాసులో బంగారు బిస్కెట్‌ వేశాడు.. ఆ తర్వాత ఆ గోల్డ్‌ బిస్కెట్‌ మునిగి పోయేంత వరకు..

Watch: అయ్యో రామా..! పసిడితో ప్రయోగాలనుకుంటే ఇంకేదో అయిపాయే.. అంత బంగారాన్ని చేతులారా..
Pure Gold
Follow us
Jyothi Gadda

|

Updated on: May 15, 2023 | 1:08 PM

ప్ర‌పంచంలో విలువైన వ‌స్తువుల్లో బంగారం కూడా ఒక‌టి. బంగారాన్ని ఆభ‌రణాల రూపంలో వినియోగిస్తుంటాయి. విలాస వ‌స్తువుగా పేరుపొందిన ఈ బంగారం ధ‌ర ఎప్పుడూ చుక్కలనంటుతూనే ఉంటుంది… మ‌న‌దేశంలో తులం బంగారం కొనాలి అంటే సుమారు 60 నుంచి 70 వేల వరకు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక కొంత‌మంది బంగారాన్ని మెరుగుపెడ‌తామ‌ని చెప్పి కొన్ని రకాల ర‌సాయ‌నాలు వేసి కొద్ది కొద్దిగా దానిని క‌రిగించుకొని వెళ్తుంటారు. బంగారాన్ని మెరుగుపెట్ట‌డం కోసం చాలా మంది హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను వినియోగిస్తుంటారు. అలా ప్రజల్ని నమ్మించి కొందరు కేటుగాళ్లు బంగారాన్ని మాయం చేస్తుంటారు. అయితే, ఇంచుమించు అలాంటిదే ఈ వీడియో కూడా. యాసిడ్‌లో స్వచ్ఛమైన బంగారు బిస్కెట్‌ కరిగించే ప్రయోగం ఎంత ఖర్చైనదో చూస్తే మీ కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

కెమిస్ట్రీ సైన్స్ అనేది నిజంగా ఓ అద్భుతమనే చెప్పాలి. సైద్ధాంతిక అధ్యయనాలు బోరింగ్ అయితే, ఆచరణాత్మక ప్రయోగాలు ఖచ్చితంగా సరదాగా, ఆసక్తికరంగా ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక పజిల్స్‌తో ఉంటూ ఉన్నప్పటికీ, లోతైన అన్వేషణను కొనసాగించడానికి ఇష్టపడే కొంతమంది వెర్రి సైన్స్ అభిమానులు కూడా ఉన్నారు. వాస్తవానికి, చాలా వరకు ప్రయోగశాల్లల్లో చేపట్టిన ప్రయోగాలు విజయవంతమవుతాయి.. మరికొన్ని విఫలమవుతాయి. ఈ ఇంటర్నెట్ యుగంలో ఇటువంటి అనేక తక్కువ-కీ ల్యాబ్ ప్రయోగాలు అనేకం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి ఈ ప్రయోగం కూడా.. స్వచ్ఛమైన బంగారాన్ని యాసిడ్‌లో కరిగించే ఈ పిచ్చి ప్రయోగాన్ని చూపించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియోలో వివరించినట్లుగా సైన్స్ అభిమాని తన చేతిలో 100-గ్రాముల స్వచ్ఛమైన బంగారు బిస్కెట్‌ని పట్టుకుని ప్రయోగం మొదలు పెట్టాడు. అయితే, ఇక్కడ ప్రయోగానికి ఉపయోగించిన స్వచ్ఛమైన బంగారం ధర విలువ అక్షరాల రూ.6.30 లక్షలు అని తెలిసింది. అతను ముందుగా ఒక గాజు గ్లాసులో బంగారు బిస్కెట్‌ వేశాడు.. ఆ తర్వాత ఆ గోల్డ్‌ బిస్కెట్‌ మునిగి పోయేంత వరకు.. గాఢమైన హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను పోస్తాడు. ఆ తర్వాత నైట్రిక్ యాసిడ్‌ను కలిపాడు.. అతను గాజు గ్లాసులో నైట్రిక్ యాసిడ్‌ను పోసిన వెంటనే బంగారు బిస్కెట్‌ కరిగిపోవడం ప్రారంభమవుతుంది. కొన్ని గంటల్లో, బంగారు కడ్డీ పూర్తిగా విచ్ఛిన్నం కావడం మనం చూడొచ్చు. బంగారు బిస్కెట్‌ యాసిడ్‌లో పూర్తిగా కరిగిపోయి చివరకు.. అది పూర్తిగా అదృశ్యమవుతుంది.

ప్రయోగం ద్వారా అతడికి మిగిలింది కేవలం నారింజ రంగులో ఉన్న ద్రవం మాత్రమే.. ఆఖరుకు ఆ ద్రవాన్ని ఏం చేయాలో తెలియక గ్లాసుతో సహా నెలకొసి కొట్టాడు. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోను యూజర్లు భారీగా షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అంతేకాదు, నెటిజన్లు హాస్యాస్పదమైన వ్యాఖ్యలతో కామెంట్ బాక్స్‌ను ముంచెత్తారు.

మరిన్ని ట్రెండింగ్‌ న్యూస్‌ కోసం ఇక్కడ ఈ లింక్‌ పై క్లిక్‌ చేయండి..

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..