Viral Video: స్నేహమంటే ఇదేరా.. మనం కూడా ఈ కుక్కలను చూసి ఎంతో నేర్చుకోవాలి..
విదేశీ జాతి కుక్కల జీవితం.. వీధి కుక్కల జీవితానికి మధ్య వ్యత్యాసం మాటల్లో వర్ణించలేనిది. తమ ఇంట పెరిగే విదేశీ జాతుల కుక్కలకు తాము తల్లిదండ్రులుగా భావించి.. తమ పిల్లల మాదిరిగానే అపురూపంగా పెంచుకుంటారు. అయితే వీధి కుక్కలతో విదేశీ పెంపుడు కుక్కలస్నేహానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది కుక్కలను పెంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. తమ ఇంటిలో సభ్యుల్లా కుక్కలను చూస్తారు. అంతేకాదు తాము పెంచుకునే కుక్కలకు పుట్టిన రోజు, సీమంతం, పెళ్లి వంటి వేడుకలను జరిపిస్తున్నారు కూడా.. అయితే ఎక్కువమంది విదేశీ కుక్కల ను పెంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. వేడి కుక్కలను దగ్గరకు కూడా చేరనివ్వరు. అందుకనే ఎక్కువగా వీధి కుక్కలు వీధుల్లో దుర్భర జీవితాన్ని గడుపుతున్నాయి. అనిశ్చితంగా జీవిస్తూ ఉంటాయి. కొన్ని కుక్కల జీవితాలు ఏ వాహన చక్రాల కింద ముగిస్తే, మరికొన్ని ఆకలితో చనిపోతున్నాయి. అంతే కాదు కొన్ని వీధి కుక్కలు మానవుల క్రూరమైన నేచర్ తో అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాయి.
అందుకనే విదేశీ జాతి కుక్కల జీవితం.. వీధి కుక్కల జీవితానికి మధ్య వ్యత్యాసం మాటల్లో వర్ణించలేనిది. తమ ఇంట పెరిగే విదేశీ జాతుల కుక్కలకు తాము తల్లిదండ్రులుగా భావించి.. తమ పిల్లల మాదిరిగానే అపురూపంగా పెంచుకుంటారు. అయితే వీధి కుక్కలతో విదేశీ పెంపుడు కుక్కలస్నేహానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.




It breaks my heart to see them ignored while people opt for fancy foreign breeds. Let’s change that and give our furry friends the love and care they deserve. Indie dogs do desrve a loving home. #HeartbrokenForStrays #LoveAllDogs#dogs pic.twitter.com/7MTqURKvrr
— Vidit Sharma ?? (@TheViditsharma) April 24, 2023
వైరల్ అవుతున్న వీడియోలో సైబీరియన్ హస్కీ, గోల్డెన్ రిట్రీవర్ కుక్కలు కారు లోపల తోక ఊపుతూ కనిపించాయి. అదే సమయంలో కారు బయట ఓ వీధి కుక్క నిలబడి ఉంది. అంతేకాదు ఈ వీధి కుక్కను చేరుకోవడానికి కారులో కుక్కలు తోక ఊపుతూ ట్రై చేస్తుంటే.. వాటిని తాను చేరుకోవడానికి వీధి కుక్క ప్రయత్నిస్తూ ఉంది. వాటిని చేరుకొని ప్రేమగా ముద్దు పెట్టుకుంది. తన పాదాలతో కారులోని కుక్కలను తాకుతూ తన ప్రేమని తెలియజేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. వీధి కుక్కను కారులోని ఖరీదైన కుక్కలు కూడా ఇష్టపడినట్లు తెలుస్తోంది.
ట్విట్టర్‌లో విదిత్ శర్మ షేర్ చేసిన వీడియోకి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రజలు ఫాన్సీ ఫారెన్ బ్రీడ్‌లను ఎంచుకుంటూ.. వీధి కుక్కలను విస్మరిస్తున్నారు. ఇది చూస్తున్న నా మనసు బాధపడుతుంది. ఇలాంటి పరిస్థితులను మార్చాలి.. మన వీధి కుక్కలకు కూడా తగిన ప్రేమ, సంరక్షణను అందిద్దాం. ఈ వీధి కుక్కలు ప్రేమకు ఇంట్లో పెంచుకోవడానికి అర్హమైనవి అని పేర్కొన్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కుక్కల పట్ల ప్రేమను .. వీధి కుక్క పట్ల బాధను వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలు కూడా ప్రేమగా అందంగా ఉంటాయి. ఇవి విదేశీ బ్రీడ్ కుక్కలకంటే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటాయి. వైద్యపరంగా మెరుగైన జీవితాన్ని గడుపుతాయని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ఇంటి బయట ఉన్న ఈ పేద కుక్కను చూడటం చాలా హృదయ విదారకంగా ఉంది. ఈ కుక్క కూడా కారులో ఉన్న కుక్కలతో కలిసి ఉంటే బాగుండేది అని కామెంట్ చేశారు. నాకు ఎప్పుడూ ఒకటే అనిపిస్తుంది.. ప్రజలు వీధికుక్కల పట్ల ఎలాంటి సెంటిమెంట్ చూపించరు.. ఇది నేను చూశాను…దీనికి అర్థం లేదు. కుక్క ఏ కుక్క అయినా కుక్కే.. అవి ఒక జీవిమాత్రమే అంటూ వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
