Turtle Video: వేసవి తాపంతో అల్లాడిన తాబేలు.. దాహం తీరుస్తూ యువతి ఆటలు.. చిరెత్తుకొచ్చి తాబేలు ఏమి చేసిందంటే..

వేసవి కాలం కావడంతో ఎండలు దంచికొడుతున్నాయి. ఓ పార్క్‌లాంటి ప్రదేశంలో ఓ తాబేలు వేసవి తాపంతో నీటికోసం అలమటిస్తోంది. ఇంతలో అటుగా వచ్చిన మహిళకు ఆ తాబేలు కనిపించింది. పాపం తాబేలు నీళ్లకోసం అల్లాడుతున్నట్టుందని గ్రహించిన మహిళ దానికి తనవద్ద ఉన్న బాటిల్‌లోని నీళ్లను తాగించింది.

Turtle Video: వేసవి తాపంతో అల్లాడిన తాబేలు.. దాహం తీరుస్తూ యువతి ఆటలు.. చిరెత్తుకొచ్చి తాబేలు ఏమి చేసిందంటే..
Turtle Attacks Woman
Follow us
Surya Kala

|

Updated on: May 13, 2023 | 12:01 PM

సాధారణంగా తాబేళ్లు చాలా కూల్‌గా ఉంటాయి. వాటి జోలికి వెళ్లనంతవరకూ అవి ఎవరినీ ఏమీ చేయవు. అలా కాదని వాటికి తిక్కరేగే పనులు చేసారో వాటి ప్రతాపం చూపుతాయి. తాజాగా ఓ మహిళకు అలాంటి అనుభవమే ఎదురైంది. తాబేలుకు నీళ్లిచ్చినట్టే ఇచ్చి ఆమె చేసిన పనికి తాబేలుకు చిర్రెత్తింది. దాంతో ఆమెపై ఒక్కసారిగా దాడికి పాల్పడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై రకరాలుగా స్పందించారు నెటిజన్లు.

వేసవి కాలం కావడంతో ఎండలు దంచికొడుతున్నాయి. ఓ పార్క్‌లాంటి ప్రదేశంలో ఓ తాబేలు వేసవి తాపంతో నీటికోసం అలమటిస్తోంది. ఇంతలో అటుగా వచ్చిన మహిళకు ఆ తాబేలు కనిపించింది. పాపం తాబేలు నీళ్లకోసం అల్లాడుతున్నట్టుందని గ్రహించిన మహిళ దానికి తనవద్ద ఉన్న బాటిల్‌లోని నీళ్లను తాగించింది. మహిళ బాటిల్‌లో నీళ్లు తాబేలు నోటిపోస్తుంటే ఎంతో ఆత్రంగా తాగేసింది తాబేలు. ఆ మహిళ తాబేలుకు నీళ్లు తాగించడమే కాదు, దాని ఒంటిపైన కూడా నీళ్లు చల్లింది. అలా పదే పదే చేస్తూ తాబేలుకు నీళ్లు తాగించింది. అంతా బాగానే ఉంది.

ఇవి కూడా చదవండి

ఉన్నట్టుండి ఆ తాబేలుకు ఎందుకో చిర్రెత్తుకొచ్చింది. ఆ మహిళ చేసిన సాయం మర్చిపోయి ఆమెపై దాడికి ప్రయత్నించింది. అయితే వారిద్దరి మధ్యలో కంచె అడ్డుగా ఉండటంతో మహిళ తప్పించుకుంది. ఈ వీడియో నెట్టింట చేరి వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ఇక చాలని చెబుతున్నా వినకుండా తాబేలు ఒళ్లంతా తడిపితే చిరాగ్గా ఉండదా.. అందుకే అలా షాకిచ్చింది అంటూ కామెంట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే