Lovers Video: స్నేహితుడి ప్రేమ కోసం ఫ్రెండ్స్ సాయం.. ప్రియురాలు ఫిదా.. నెట్టింట వీడియో వైరల్

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ ప్రేమ జంట బైకుపై వెళ్తుంటుంది. కొద్ది దూరం వెళ్లగానే వెనుక కూర్చున్న ప్రేయసి.. ప్రియుడిని కౌగిలించుకుంటుంది. వారికి తెలీకుండా స్నేహితులు వెనుక నుంచి ఫాలో అయ్యారు. ప్రేమజంటను సర్‌ఫ్రైజ్ చేయాలనుకున్న ఆ ఫ్రెండ్స్‌లో ఓ యువకుడు లవ్ సింబల్ ఉన్న టీషర్ట్ ధరించి స్కూటీపై ప్రేమికులను ఓవర్‌టేక్ చేస్తూ ముందుకు వెళ్లాడు.

Lovers Video: స్నేహితుడి ప్రేమ కోసం ఫ్రెండ్స్ సాయం.. ప్రియురాలు ఫిదా.. నెట్టింట వీడియో వైరల్
Lovers Video Viral
Follow us
Surya Kala

|

Updated on: May 13, 2023 | 11:07 AM

ప్రేమపేరుతో యువత బరితెగించి ప్రవర్తిస్తున్నారు. పట్ట పగలు పార్కుల్లో బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం, బైకుల్లో వెళుతూ అసభ్యకర పనులు చేయడం, చివరికి రైళ్లలో ప్రయాణికుల సమక్షంలో రాసలీలలు ఎక్కువైపోయాయి. ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బైకుపై వెళ్తున్న ప్రేమ జంటకు వాళ్ల ఫ్రెండ్స్‌ ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. వాళ్ల బైక్‌ను ఫాలో అవుతూ వాళ్లు చేసిన పనికి యువతి షాకైంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ ప్రేమ జంట బైకుపై వెళ్తుంటుంది. కొద్ది దూరం వెళ్లగానే వెనుక కూర్చున్న ప్రేయసి.. ప్రియుడిని కౌగిలించుకుంటుంది. వారికి తెలీకుండా స్నేహితులు వెనుక నుంచి ఫాలో అయ్యారు. ప్రేమజంటను సర్‌ఫ్రైజ్ చేయాలనుకున్న ఆ ఫ్రెండ్స్‌లో ఓ యువకుడు లవ్ సింబల్ ఉన్న టీషర్ట్ ధరించి స్కూటీపై ప్రేమికులను ఓవర్‌టేక్ చేస్తూ ముందుకు వెళ్లాడు. తర్వాత ఐ అక్షరం ఉన్న టీషర్టు ధరించి మరో యువకుడు ఇంకోవైపునుంచి ఓవర్‌టేక్‌ చేసి వెళ్లాడు. చివరగా యూ అనే అక్షరం ఉన్న టీషర్టు ధరించిన ఓవర్‌టేక్ చేసి వెళ్లి ముందు వెళ్లిన ఇద్దరికీ తోడవుతాడు. ఐ లవ్ యూ.. అనే అర్థం వచ్చేలా మూడు వాహనాలు పక్కపక్కనే వెళ్తూ ప్రేమికుల బైక్‌ ముందు వెళ్ళారు.

ఇవి కూడా చదవండి

ఇంతలో ఇంకో బైకులో మరో యువకుడు పూల బొకే పట్టుకొని వచ్చి ప్రేమజంటకు అందించాడు. స్నేహితులు ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్‌కి ఆ ప్రేమికులు ఆశ్చర్యపోయారు. అనంతరం వారి వాహనాన్ని రోడ్డు పక్కగా ఆపి కిందకు దించేస్తారు ఫ్రెండ్స్‌. అందరి సమక్షంలో ప్రియుడు పూలబొకేను అందించి ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేసాడు. స్నేహితులు టపాసులు పేల్చుతూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే