Watch Video: ధోనీని మరిపించాడుగా.. కళ్లుచెదిరే రనౌట్‌తో షాకైన అశ్విన్.. వీడియో వైరల్..
RR vs RCB, IPL 2023: ఐపీఎల్ 2023 (IPL 2023)లో ఆదివారం రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RR vs RCB) మధ్య మ్యాచ్ ఉత్కంఠ రేపింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో RRపై అనూహ్యమైన ప్రదర్శనను RCBకనబరిచింది.
Anuj Rawat: ఐపీఎల్ 2023 (IPL 2023)లో ఆదివారం రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RR vs RCB) మధ్య మ్యాచ్ ఉత్కంఠ రేపింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో RRపై అనూహ్యమైన ప్రదర్శనను RCBకనబరిచింది. శాంసన్ సేనను బెంగళూరు బౌలర్లు కేవలం 59 పరుగులకే అవుట్ చేసి 112 పరుగుల తేడాతో గెలుపొందేలా చేశారు. దీంతో బెంగళూరు ప్లే ఆఫ్ ఆశను సజీవంగా ఉంచుకుంది. ఫీల్డింగ్‌లోనూ ఆర్‌సీబీ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు . ముఖ్యంగా అనూజ్ రావత్ రనౌట్ ధోనీ తరహాలో ఆకట్టుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరలవుతోంది.
బ్యాటింగ్‌లో కేవలం 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 29 పరుగులు చేసిన అనుజ్ రావత్.. వికెట్ కీపర్‌గానూ తన సత్తా చాటాడు. దినేష్ కార్తీక్ గైర్హాజరీలో వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించిన రావత్.. రనౌట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ రనౌట్ కూడా ఎంఎస్ ధోని చేసినట్లే ఉండడం గమనార్హం. కర్ణ్ శర్మ వేసిన 8వ ఓవర్ చివరి బంతికి షిమ్రాన్ హెట్మెర్ రెండు పరుగులు చేశాడు. కానీ, సిరాజ్ వేగంగా బంతిని వికెట్ కీపర్ వైపు విసిరాడు. ఇది గమనించిన హెట్మెర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక్క పరుగు చాలని చెప్పాడు.
కానీ, అప్పటికి అశ్విన్ క్రీజులో నుంచి బయటకు వచ్చాడు. బంతి చేతికి చేరడంతో కీపర్ రావత్ వికెట్ వైపు చూడకుండా వెనుక నుంచి విసిరిన బంతి వికెట్ ను తాకింది. అశ్విన్ వెంటనే క్రీజులోకి బ్యాట్‌ని తీసుకొచ్చాడు. కానీ రెప్పపాటులోనే రనౌట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ వీడియో చూడండి.
One of the best glove work in IPL history – Anuj Rawat.pic.twitter.com/hW7FpspcCw
— Johns. (@CricCrazyJohns) May 14, 2023
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీకి కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. డుప్లెసిస్ 44 బంతుల్లో 55 పరుగులు చేయగా, మాక్స్‌వెల్ 54 పరుగులు చేశాడు. చివరికి రావత్ 11 బంతుల్లో 29 పరుగులు చేయగా, ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయి కేవలం 59 పరుగులకే కుప్పకూలింది. జట్టులో హెట్‌మైర్ (35) అత్యధిక స్కోరు చేశాడు. ఆర్సీబీ తరపున వేన్ పార్నెల్ 3 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..