హోటల్ గదిలో ప్రముఖ పాప్ సింగర్ మృతి.. సూసైడ్ నోట్ లభ్యం
ప్రముఖ కొరియన్పాప్ సింగర్హేసూ (29) సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. దక్షిణ కొరియా జియోల్లబుక్-డో ప్రావిన్స్‌లోని ఓ హోటల్ గదిలో విగత జీవిగా పడున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహం వద్ద..
ప్రముఖ కొరియన్పాప్ సింగర్హేసూ (29) సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. దక్షిణ కొరియా జియోల్లబుక్-డో ప్రావిన్స్‌లోని ఓ హోటల్ గదిలో విగత జీవిగా పడున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహం వద్ద సూసైడ్‌నోట్‌ను కనుగొన్నారు.
వాంజుగన్‌లో మే 20న షెడ్యూల్అయిన గ్వాన్‌జుమియోన్ పీపుల్స్ డే ఈవెంట్‌కు ఆమె హాజరుకావల్సి ఉంది. దీంతో తొలుత ఆమె హాజరుకావడం లేదని ఈవెంట్ ఆర్గనైజర్లు మీడియాకు తెలిపారు. ఆ తర్వాత ఆమె సూసైడ్ చేసుకుని మృతి చెందినట్లు తెల్పడంతో హేసూ మరణ వార్త వెలుగు చూసింది. హేసూ మృతిపై స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. స్పాట్‌లో దొరికిన సూసైడ్ లెటర్ ప్రకారం హేసూది ఆత్మహత్యగా పోలీసులు స్పష్టం చేశారు.
కాగా 1993లో జన్మించిన హేసూ.. ‘మై లైఫ్, ‘మీ’ అనే ఆల్బమ్‌తో 2019లో కే పాప్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత గాయో స్టేజ్, హ్యంగౌట్ విత్యూ, ది ట్రోట్ షో లాంటి కార్యక్రమాల్లో పాడి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఈ మధ్య కాలంలో కే పాప్ సింగర్ల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. గత నెల 19న ప్రముఖ కే పాప్స్టార్మూన్బిన్ (25) మృతి యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.