Tollywood: చూపులే చూరకత్తులంటే నమ్మలేదు.. నీ కళ్లను చూస్తే నిజమనిపిస్తుంది.. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టండి..
తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. వాస్తవానికి ఆ హీరోయిన్ కన్నడమ్మాయి.. కానీ తెలుగులోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 'అందమైన ప్రేమకథలో అంతులేని విషాదం' దానికి కథతో ప్రేక్షకుల మనసులను దొచేసింది. ఈ బ్యూటీని గుర్తుపట్టండి.

కళ్లు కూడా మాట్లడుతాయని తెలియదు.. ఆ కలువ కన్నులు కబుర్లు చెబుతాయి.. ప్రశ్నిస్తాయి.. కోప్పడతాయి.. కొడతాయి కూడా అని శర్వానంద్ చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది కదూ.. కళ్లు పలికే భావాలు అనంతం.. సంతోషాన్ని.. దుఃఖాన్ని మనసు దాచిన.. కళ్లు దాచలేవు. పైన ఫోటోను చూశారు కదా.. ఆ అందమైన కలువ కళ్లు చూరకత్తులే.. ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టండి. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. వాస్తవానికి ఆ హీరోయిన్ కన్నడమ్మాయి.. కానీ తెలుగులోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ‘అందమైన ప్రేమకథలో అంతులేని విషాదం’ దానికి కథతో ప్రేక్షకుల మనసులను దొచేసింది. ఈ బ్యూటీని గుర్తుపట్టండి. ఈ అమ్మడు ఇప్పటివరకు తెలుగులో నేరుగా ఒక్క సినిమా కూడా చేయలేదండోయ్. కన్నడలో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరంటే.. దియా ఫేమ్ ఖుషీ రవి.
2020లో విడుదలైన దియా మూవీతో తెరంగేట్రం చేసింది ఖుషీ రవి. డైరెక్టర్ కే.ఎస్. ఆశోఖ్ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ స్వర్ణలత ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి కృష్ణ చైతన్య నిర్మించారు. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమాను ఆ తర్వాత తెలుగులో డబ్ చేయగా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో పృథ్వీ అంబర్, దీక్షిత్ శెట్టి, ఖుషీ రవి ప్రధాన పాత్రలలో నటించారు. ఇందులో దియా పాత్రలో ఖుషీ రవి నటించింది. ఈ సినిమాలో ఆమె నటన హైలెట్. మల్టీపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో ఖుషీ జీవించింది. ప్రేమ, దుఃఖం.. నిస్పృహ వంటి వివిధ భావోగ్వాలలో అంతర్ముఖమైన అమ్మాయిగా ఖుషి నటనకు ప్రేక్షకులు ఆకట్టుకుంది.




ఖుషీ బెంగుళూరులో జన్మించింది. 2020లో దియా సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె.. కన్నడతోపాటు.. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత స్పూకీ కాలేజ్, నక్షీ చిత్రాల్లో నటించింది. ఈ సినిమా తర్వాత ఖుషి మరో చిత్రంలో కనిపించలేదు. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.