Rashmika Mandanna: మన వాళ్లకు చిక్కితే ఒట్టు.. రష్మిక నిర్ణయంతో తెలుగు ఫ్యాన్స్ అప్‌సెట్..!
రష్మిక మందన్న పూర్వజన్మలో పుట్ బాల్ ప్లేయర్ అయ్యుంటారబ్బా..! అదేంటి అలా అంటున్నారు..? ఫుట్ బాల్‌కు ఈమెకు లింక్ ఏంటనే డౌట్ రావచ్చు. కానీ మేం ఇచ్చే ఎక్స్‌ప్లెనేషన్ చూసిన తర్వాత మీరే అంటారు రష్మిక పూర్వ జన్మలో కాదు..

రష్మిక మందన్న పూర్వజన్మలో పుట్ బాల్ ప్లేయర్ అయ్యుంటారబ్బా..! అదేంటి అలా అంటున్నారు..? ఫుట్ బాల్‌కు ఈమెకు లింక్ ఏంటనే డౌట్ రావచ్చు. కానీ ఈ వివరణ చూసిన తర్వాత మీరే అంటారు రష్మిక పూర్వ జన్మలో కాదు.. ఈ జన్మలోనే ఫుట్ బాల్ ప్లేయర్ అని. మరి ఆమె గేమ్ ఏంటో చూద్దామా.. ఇంతకీ రష్మిక ఎవరితో ఫుట్ బాల్ ఆడుతున్నారు..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవేయండి..
రష్మిక చేసే పనులకు మైండ్ బ్లాక్ అయిపోద్దని.. మనకు అర్థం కావడానికి కాస్త టైమ్ పట్టింది అంటున్నారు ఆమె తీరు చూసాక దర్శక నిర్మాతలిప్పుడు. ఒక్కసారి ఆమె కెరీర్‌ను పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్‌పై ఉంది. అందులో తప్పేముంది.. ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి చేస్తుందనుకోవచ్చు. అక్కడే ఉంది అసలు ట్విస్ట్.




హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్‌లో నటిస్తున్న రష్మిక.. ఆ తర్వాత షాహిద్ కపూర్, విక్కీ కౌశల్ లాంటి హీరోలతో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో రష్మిక ఎప్పుడూ నెంబర్ వన్నే. అప్పట్లో తెలుగులో ఛాన్స్ వచ్చినపుడు కన్నడ ఇండస్ట్రీని ఫుట్ బాల్‌లా తన్నేసారు. దాంతో కన్నడిగులు ఈమెపై కన్నెర్ర జేసారు కూడా.
అప్పుడు సొంత ఇండస్ట్రీకి అప్లై చేసిన ఫుట్ బాల్ గేమ్.. ఇప్పుడు టాలీవుడ్‌కు పాటిస్తున్నారు రష్మిక. బాలీవుడ్‌లో వరస ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి టాలీవుడ్‌పై పెద్దగా ఫోకస్ చేయట్లేదు. ప్రస్తుతం నితిన్, వెంకీ కుడుముల సినిమాలో మాత్రమే రష్మిక నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ పుష్ప 2 లో కూడా ఉన్నారు. కొన్ని మూవీస్ కోసం తెలుగు ప్రొడ్యూసర్లు రష్మిక కోసం ప్రయత్నించినా.. అటు వైపు నుంచి సానుకూల స్పందన ఉండట్లేదని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి బాలీవుడ్‌కి జంప్ అయిన రష్మిక.. తెలుగు ఇండస్ట్రీని సైతం కరివేపాకులా వాడుకుని ఫుట్ బాల్‌లా తన్నేస్తున్నారని గొల్లుమంటున్నారు ఆమె తెలుగు ఫ్యాన్స్.
రష్మిక ఇన్‌స్టా పోస్ట్..
View this post on Instagram
-ప్రవీణ్ కుమార్, టీవీ9 తెలుగు (ET)
మరిన్ని సినిమా వార్తలు చదవండి..