Jan Suraj Yatra: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు గాయాలు.. వాయిదా పడ్డ పాదయాత్ర

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో నిర్వహిస్తోన్న 'జన్ సురాజ్' పాదయాత్ర వాయిదా పడింది. ఎడమ కాలికి గాయం కావడతో వైద్యులు 15 నుంచి 20 రోజులు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారు. దీంతో పాదయాత్రను కొద్ది రోజులు పాటు వాయిదా..

Jan Suraj Yatra: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు గాయాలు.. వాయిదా పడ్డ పాదయాత్ర
Prashant Kishor
Follow us
Srilakshmi C

|

Updated on: May 15, 2023 | 5:29 PM

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో నిర్వహిస్తోన్న ‘జన్ సురాజ్’ పాదయాత్ర వాయిదా పడింది. ఎడమ కాలికి గాయం కావడతో వైద్యులు 15 నుంచి 20 రోజులు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారు. దీంతో పాదయాత్రను కొద్ది రోజులు పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్ తెలిపారు. త్వరగా కోలుకుంటే 15 రోజుల్లోనే తిరిగి జన్ సురాజ్ పాదయాత్రను ప్రారంభిస్తానని, లేదంటే జూన్​ 11 నుంచి మళ్లీ యాత్రను తిరిగి మొదలుపెడతానని సమస్తిపుర్ జిల్లాలో మీడియాకు తెలిపారు.

‘నాకు మరే ఇతర ఆరోగ్య సమస్యలు లేవు. అధ్వానంగా ఉన్న రోడ్లపై ఎక్కువ దూరం నడవడం వల్ల కాలి కండరాలపై భారం పడి నడవడానికి ఇబ్బందిగా మారింది. ఇది మానడానికి కనీసం 15 నుంచి 20 రోజుల విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారు. ఈ పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను సందర్శించాను. మరికొన్ని ప్రాంతాల్లో తిరగాల్సి ఉంది. కాబట్టి కొంత కోలుకున్నాక తిరిగి జన్​ సురాజ్​ పాదయాత్రను కొనసాగిస్తాను’ అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

కాగా గతేడాది అక్టోబర్ 2 నుంచి 3,500 కిలోమీటర్ల ‘జన్ సురాజ్ పాదయాత్ర’ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 2500 కి.మీలకుపైగా నడిచిన ప్రశాంత కిషోర్‌ మారుమూల గ్రామాల్లోని ప్రజలను పరామర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.