AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Matter Aera Electric Bike: ఇది ఎలక్ట్రిక్ బైక్‌లలో గేమ్ ఛేంజర్.. నాలుగు గేర్లతో స్పోర్టీ లుక్..  ప్రీ బుకింగ్స్‌పై అదిరే ఆఫర్లు..

మీరు ఒక వేళ స్పోర్ట్స్ లుక్, గేర్ బాక్స్ సిస్టమ్ ఉన్న ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తుంటే.. ఈ కథనం మీ కోసమే. దేశంలోనే మొదటి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ ని అహ్మదాబాద్ కు చెందిన స్టార్టప్ కంపెనీ మ్యాటర్ సోమవారం ప్రకటించింది. దీని పేరు మ్యాటర్ మ్యాటర్ ఏరా(Matter Aera).

Matter Aera Electric Bike: ఇది ఎలక్ట్రిక్ బైక్‌లలో గేమ్ ఛేంజర్.. నాలుగు గేర్లతో స్పోర్టీ లుక్..  ప్రీ బుకింగ్స్‌పై అదిరే ఆఫర్లు..
Matter Aera Electric Bike
Madhu
|

Updated on: May 16, 2023 | 3:00 PM

Share

ప్రస్తుతం ఇండియన్ ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ ల హవా నడుస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగదారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. అయితే మంచి ఫీచర్లు, రేంజ్ ఉన్న బైక్ లకు కూడా డిమాండ్ బాగానే ఉంది. మీరు ఒక వేళ స్పోర్ట్స్ లుక్, గేర్ బాక్స్ సిస్టమ్ ఉన్న ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తుంటే.. ఈ కథనం మీ కోసమే. దేశంలోనే మొదటి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ ని అహ్మదాబాద్ కు చెందిన స్టార్టప్ కంపెనీ మ్యాటర్ సోమవారం ప్రకటించింది. దీని పేరు మ్యాటర్ మ్యాటర్ ఏరా(Matter Aera). దీనిలో ప్రత్యేకత ఏంటి అంటే ఈ బండిలో గేర్లు ఉంటాయి. సాధారణంగా ఎలక్ట్రిక్ బైక్స్‌కు గేర్లు ఉండవు.

ప్రీ బుకింగ్స్ ఆఫర్లు..

ఈ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ మే 17 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి 9999 కస్టమర్లు ఎవరైతే ఈ మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేస్తారో.. వారికి రూ. 5 వేల డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా కేవలం రూ. 1,999తో వీళ్లు బైక్‌ను ప్రీబుకింగ్ చేసుకోవచ్చు. అలాగే 10 వేల నుంచి 29,999 వరకు బుకింగ్స్ అయితే వీరికి రూ. 2500 వరకు బెనిఫిట్ లభిస్తుంది. రూ. 2,999తో బుక్ చేసుకోవచ్చు. అటు పైన అయితే రూ. 3,999తో ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రిబుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీ బుకింగ్ క్యాన్సిల్ అయితే అప్పుడు కస్టమర్లు చెల్లించిన డబ్బులు మొత్తం వెనక్కి ఇచ్చేస్తారు. అలాగే మ్యాటర్ ఇబైక్ ప్రిబుకింగ్స్ అనేవి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో ఉంటాయి.

బుకింగ్ ఎక్కడంటే..

దేశ వ్యాప్తంగా 25 పట్టణాల్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ అందుబాటులో ఉండనున్నాయి. అలాగే కంపెనీ ఎర్లీ బడర్డ్ ప్రిబుకింగ్ ఆఫర్లు కూడా అందిస్తోంది. స్పెషల్ ఇంట్రడక్టరీ ప్రైస్ అందుబాటులో ఉంటుంది. అందువల్ల కొత్త బైక్ కొనే వారు ఈ మోడల్ పరిశీలించొచ్చు. ప్రీమ కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు ఈ బైక్‌ను ప్రిబుకింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మీరు ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. అలాగే ఓక్టోక్యాపిటల్ వెబ్‌సైట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

బైక్ పూర్తి వివరాలు ఇవి..

ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 4 స్పీడ్ హైపర్ షిఫ్ట్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇది 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6 సెకన్లలోనే అందుకుంటుంది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చేస్తే.. ఈ ఎలక్ట్రిక్ బైక్ 125 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఇంకా ఈ బైక్ రన్నింగ్ కాస్ట్ కూడా తక్కువే. కిలోమీటర్‌కు 25 పైసలు ఖర్చు వస్తుంది. ఇంకా ఈ బైక్‌లో 7 ఇంచుల టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంటుంది. కాగా ఈ మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 1,43,999 నుంచి ప్రారంభం అవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..