AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణ ఘటన.. భార్యను హతమార్చి స్టోరేజీ బాక్స్‌లో దాచేసిన భర్త! ఆ బంధానికి అడ్డొస్తుందనీ..

భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడం కొత్తేమీకాదు. సంసారం సజావుగా సాగిపోయే క్రమంలో మధ్యమధ్యలో పొరపొచ్చాలు, గిల్లికజ్జాలు రావడం సహజమే. ఐతే కొన్నాళ్లకు అవి సమసిపోయి బంధం మరింత బలపడుతుంది. లేదంటే పెటాలకులవుతుంది. ఐతే పరాయి స్త్రీల వ్యామోహంలో పడి ఓ వ్యక్తి భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఆమె అడ్డుతొలగించుకునేందుకు మూడో కంటికి తెలియకుండా..

దారుణ ఘటన.. భార్యను హతమార్చి స్టోరేజీ బాక్స్‌లో దాచేసిన భర్త! ఆ బంధానికి అడ్డొస్తుందనీ..
Man Kills Wife In Madhya Pradesh
Srilakshmi C
|

Updated on: May 16, 2023 | 5:07 PM

Share

భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడం కొత్తేమీకాదు. సంసారం సజావుగా సాగిపోయే క్రమంలో మధ్యమధ్యలో పొరపొచ్చాలు, గిల్లికజ్జాలు రావడం సహజమే. ఐతే కొన్నాళ్లకు అవి సమసిపోయి బంధం మరింత బలపడుతుంది. లేదంటే పెటాలకులవుతుంది. ఐతే పరాయి స్త్రీల వ్యామోహంలో పడి ఓ వ్యక్తి భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఆమె అడ్డుతొలగించుకునేందుకు మూడో కంటికి తెలియకుండా భార్యను హతమర్చి ఇంట్లోనే దాచేశాడు. మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా పాలఖండ గ్రామంలో కాపురం ఉంటున్న దీపా బాయి (40), వినయ్ పర్మార్‌లకు 1996లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి 21 ఏళ్ల కుమార్తె, 17 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఐతే గత కొంతకాలంగా వీరి కాపురంలో గొడవలు తలెత్తడం ప్రారంభమయ్యాయి. వినయ్‌ ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని భర్యతో తరచూ గొడవ పెట్టుకునేవాడు. దీంతో గృహహింస కింద దీపా తన భర్త వినయ్‌పై పోలీసుకుల ఫిర్యాదు చేసింది. ఐతే పోలీసులు ఇద్దరికీ నచ్చజెప్పి ఇంటికి పంపించారు. ఇంతలో దీపాను హత్య చేసి బెడ్‌ స్టోరేజీ బాక్స్‌లో 24 గంటలపాటు దాచాడు వినయ్‌. దీపా మృతిపై ఆమె సోదరుడు హేమంత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ప్రవర్తన సరిగ్గాలేనందున్న తాము విడాకులు తీసుకోవలనుకున్నట్లు దీపా తన సోదరుడు హేమంత్‌కు చెప్పినట్లు పోలీసులకు తెలిపాడు. ఇంతలో దీపా భర్త వినయ్‌తో సహా ఆమె అత్తమామలు తన సోదరిని దారుణంగా హత్య చేశారని ఆరోపించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వినయ్‌ను శుక్రవారం (మే 12) అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్పీ సచిన్‌ శర్మ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.