Couples: ఆ ఊళ్లో ఒకేసారి 501 జంటలకు పెళ్లి.. 70 ఏళ్ల వృద్ధులకు కూడా.. మ్యాటర్ తెలిస్తే అవాక్కవుతారు..!
జార్ఖండ్‌లోని గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో కొన్నేళ్లుగా సహ జీవనం చూస్తున్న జంటలు ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు ఆ గ్రామంలో నివసిస్తున్న 501 జంటలకు సామూహిక వివాహం జరిగింది. ఈ అరుదైన వేడుక రాష్ట్రంలోని ఖుంటి జిల్లా కర్రా బ్లాక్ పరిధిలోని చౌలా పాత్ర గ్రామంలో జరిగింది.
జార్ఖండ్‌లోని గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో కొన్నేళ్లుగా సహ జీవనం చూస్తున్న జంటలు ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు ఆ గ్రామంలో నివసిస్తున్న 501 జంటలకు సామూహిక వివాహం జరిగింది. ఈ అరుదైన వేడుక రాష్ట్రంలోని ఖుంటి జిల్లా కర్రా బ్లాక్ పరిధిలోని చౌలా పాత్ర గ్రామంలో జరిగింది. కేంద్ర గిరిజన మంత్రి అర్జున్ ముండా, ఆయన సతీమణి మీరా ముండా దగ్గరుండి మరీ ఈ వివాహాలను జరిపించారు. వివాహం చేసుకున్న జంటల్లో 20 నుంచి 70 సంవత్సరాల వయస్సుల వారు ఉండటం విశేషం.
ట్విస్ట్ ఏంటంటే..
ప్రస్తుతం పెళ్లి చేసుకున్న జంటల్లో చాలా మంది ఇదివరకే తల్లిదండ్రులు అయ్యారు. ఈ వేడుకలో వారి వారి పిల్లలు కూడా పాల్గొన్నారు. వృష్టి గ్రీన్ ఫార్మర్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ వేడుకను నిర్వహించింది. కాగా, కొన్ని గిరిజన తెగల్లో సహజీవనం అనేది ఒక ఆచారం. దీనిని వారు ‘ధుక్కు’ అని పిలుస్తారు. ఈ ఆచారాన్ని పాటిస్తూ చాలా మంది జంటలు సంవత్సరాల తరబడి సహజీవనం చేస్తూ వచ్చారు. పిల్లను కూడా కన్నారు. అయితే, గిరిజను ఎవరైతే పెళ్లి చేసుకుంటారో.. వారు తమ గ్రామం మొత్తానికి ఘనంగా వింధు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ ఆర్థిక భారాన్ని భరించలేని కారణంగానే.. సహజీవనం పేరుతో వారు కలిసి ఉంటారని ఒక ప్రచారం ఉంది.
ఆర్థిక కారణాలు..
పెళ్లి చేసుకునే జంట గ్రామానికంతటికీ విందు ఏర్పాటు చేయాలి. విందులో మాంసం సహా అన్ని రకాల వంటకాలు వడ్డించాల్సి ఉంటుంది. మద్యం కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. చాలా మంది పేదరికం కారణంగా.. పెళ్లి సందర్భంగా విందు ఏర్పా్ట్లు చేయలేకపోతారు. దాంతో.. చాలా మంది గిరిజనులు పెళ్లి చేసుకోకుండా సహజీవనం పేరుతో కలిసి ఉన్నారు. అయితే, సమాజంలో ఆమోదితమైన వివాహం చేసుకోకపోవడం వల్ల వారి పిల్లలకు భూమి, ఆస్తిపై హక్కు లభించింది. అలాంటి పిల్లలకు తండ్రి ఇంటి పేరు కూడా వర్తించదు. ‘ధుక్కు’ అంటే ప్రవేశించడం అని అర్థం. ఒక స్త్రీ వివాహం చేసుకోకుండా ఒక పురుషుడి ఇంట్లోకి వచ్చి జీవిస్తే ఆమెను ‘ధుక్ని’ అని పిలుస్తారు. ఆ జంటను ‘ధుక్కి’ అని పిలుస్తారు. అయితే, గిరిజన సమాచారం.. ఇలాంటి స్త్రీలు కుంకుమ ధరించడానికి కూడా అంగీకరించదు.
ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అర్జున్ ముండా..
ఏళ్ల తరబడి సహజీవనం చేస్తున్న ఈ జంటలకు కేంద్ర మంత్రి అర్జున్ ముండా సమక్షంలో వివాహం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన అర్జున ముండా.. పెళ్లి చేసుకున్న జంటలకు ఇకపై సామాజిక, న్యాయపరమైన గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ జంటలకు ఆస్తితో పాటు, ఇతర కుటుంబ వ్యవహారాల్లో చట్టపరమైన హక్కులు లభించనున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి జంటల కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అంతేకాదు.. వీరందరికీ ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..