పొదల్లోంచి వచ్చిన దుర్వాసన.. తీరా చూస్తే 40 కోతుల కళేబరాలు.. షాకైన స్థానికులు
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. హపూర్ పట్టణంలో ఒకేసారి 40 కోతులు మృత్యువాతపడటం కలకలం రేపుతోంది. ఆదివారం రోజున ఆ ప్రాంతంలో పొదల్లో నుంచి దుర్వాసన వచ్చింది. ఏంటా అని చూడగా కోతుల కళేబారాలను కనిపించడంతో అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. హపూర్ పట్టణంలో ఒకేసారి 40 కోతులు మృత్యువాతపడటం కలకలం రేపుతోంది. ఆదివారం రోజున ఆ ప్రాంతంలో పొదల్లో నుంచి దుర్వాసన వచ్చింది. ఏంటా అని చూడగా కోతుల కళేబారాలను కనిపించడంతో అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం కోతులు ఎలా చనిపోయాయనే విషయం తెలుసుకునేందుకు అటవీ అధికారులు శవపరీక్షలు నిర్వహించారు. అయితే ఈ విచారణలో తెలిసిందేమిటంటే.. ఎవరో కోతులకు ఉద్దేశపూర్వకంగానే విషం పెట్టి చంపినట్లు తెలిపారు.
అలాగే దర్యాప్తు జరుపుతుండగా.. కోతులు చనిపోయిన ప్రాంతంలో పుచ్చకాయలు, బెల్లం ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అయితే 40 కోతులు ఇలా ఒకేసారి చనిపోవడంతో అక్కడి స్థానికులు షాక్ అయ్యారు. ఇదిలా ఉండగా దేశంలోని పలు పట్టణాలు నగరాల్లోని స్థానికుల నివాసాల్లో కోతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే పలు కొతులు పంటలను కూడా నాశనం చేయడంతో.. చాలామంది రైతులు నష్టపోతున్నారు. మరికొన్ని కోతులు తరుచుగా ప్రజల ఇళ్లలోకి చొరబడి ఆహారాన్ని దొంగిలించే ఘటనలు కూడా చాలా చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు వణ్యప్రాణుల సంరక్షణ కార్యకర్తలు కూడా జంతువులను చంపేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం