AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Parliament Building: కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్..! వేగంగా ఏర్పాట్లు..!

పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. కొత్త పార్లమెంటు భవనాన్ని ఈ నెలలో ప్రారంభించవచ్చు. మే 28న కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మోడీ ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త పార్లమెంట్ హౌస్‌ను అంగరంగ వైభవంగా ప్రారంభించవచ్చు.

New Parliament Building: కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్..! వేగంగా ఏర్పాట్లు..!
New Parliament Building
Sanjay Kasula
|

Updated on: May 16, 2023 | 2:03 PM

Share

ఆధునిక భారతదేశ వైభవానికి చిహ్నం.. వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రాంతీయ కళల సమాహారం.. చేతికళలతో రూపుదిద్దుకున్న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మోడీ ప్రభుత్వం ఈ నెలతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంలో పార్లమెంట్ భవనంను ప్రారంభించాలని కేంద్రప్రభుత్వం అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంటే సరిగ్గా 26 మే 2024న నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవ తేదీ కూడా దగ్గర పడింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని కోసం భారీ వేడుకను నిర్వహించనున్నారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం మే చివరి వారంలో జరగవచ్చు సమాచారం.

కొత్త పార్లమెంట్ హౌస్ నిర్మాణం పూర్తి అయ్యింది. భవన నిర్మాణ బాధ్యతలు చూస్తున్న కేంద్ర గృహ నిర్మాణ శాఖ త్రిభుజాకారంలో ఉన్న ఈ నిర్మాణం జరిగింది. ఈ పార్లమెంట్ హౌస్ నాలుగు అంతస్తులతో ఉంటుంది. ఇందులో 1224 మంది ఎంపీలకు సీటింగ్ ఏర్పాట్లు చేశారు.  గతంలో కంటే భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నారు.

కొత్త పార్లమెంట్ ప్రత్యేకతలు ఇవే..

సువిశాలమైన కొత్త పార్లమెంటు భవనంలో అనేక ఆధునిక సౌకర్యాలు, ఫీచర్లు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇందులో పెద్ద పెద్ద హాళ్లు, సీటింగ్ లాంజెస్.. ఇలా ప్రతిదీ సరి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందింది. జాతీయ పుష్పం ఆకృతిలో రూపొందించిన రాజ్యసభ హాలు.. 384 సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. పార్లమెంట్ సజావుగా సాగేందుకు కొత్త, పాత భవనాలు సమిష్టిగా పనిచేస్తాయని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. కొత్త పార్లమెంట్ భవనంలోని అత్యాధునిక రాజ్యాంగ హాల్‌, హై టెక్నాలజీతో రూపొందించిన ఇతర కార్యాలయాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి.

సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్‌లో భాగమైన.. ఈ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది. ఇందులో పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు కమిటీ గదులు కూడా ఎన్నో హంగులతో రూపుదిద్దుకున్నాయి. చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్న పార్లమెంట్ న్యూ బిల్డింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొత్త పార్లమెంటు ప్రారంభం ఎప్పుడెప్పుడా అన్న ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

కొత్త పార్లమెంటు భవనాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

మార్చి చివరి వారంలో కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత అధికారుల నుంచి సమగ్ర సమాచారం తీసుకున్నారు. దాదాపు గంటపాటు ఆయన పార్లమెంటులో గడిపారు. అలాగే పని చేస్తున్న కార్మికులతో మాట్లాడారు. 2021 సెప్టెంబర్‌లో మోదీ ఈ స్థలాన్ని సందర్శించారు. ప్రతిపాదిత సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ స్థలంలో సుమారు గంటపాటు గడిపిన ఆయన కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ స్థితిని పరిశీలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం