Police: 3 నెలల్లో బరువు తగ్గకుంటే పోలీసులు రిటైర్ అవ్వాల్సిందే
అస్సాంలోని ఇటీవల పోలీస్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దళంలో పనిచేసే తాగుడికి బానిసై.. అధిక బరువు కలిగి ఉండి, వ్యక్తిగత నేరారోపణ ఎదుర్కొంటున్న పోలీసులకు పదవీ విరమణను ఆఫర్ చేసింది. వాళ్లు రిటైర్ అయ్యాక కూడా నెలకు మొత్తం జీతం కూడా ఇస్తామని ప్రకటించింది.
అస్సాంలోని ఇటీవల పోలీస్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దళంలో పనిచేసే తాగుడికి బానిసై..ఉబకాయం కలిగి ఉండి, వ్యక్తిగత నేరారోపణ ఎదుర్కొంటున్న పోలీసులకు పదవీ విరమణను ఆఫర్ చేసింది. వాళ్లు రిటైర్ అయ్యాక కూడా నెలకు మొత్తం జీతం కూడా ఇస్తామని ప్రకటించింది. ఇలాంటి వారు దాదాపు 650కి పైగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది. అయుతే గతంలోనే ఫిట్‌నెస్ పైనా పోలీసులు దృష్టి సారించాలంటూ ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఈ విషయంపై అస్సాం డీజీపీ జీపీ సింగ్ తాజాగా స్పందించారు. ఐపీఎస్, ఏపీఎస్ అధికారులతో పాటు ఇతర పోలీస్ అధికారులు బరువు తగ్గించుకుని ఫిట్‌నెస్‌ను మెయింటెన్ చేయాలని సూచించారు.
అయితే ఉబకాయం కలిగి ఉన్న కేటగిరిలోని పోలీసులకు మూడు నెలల పాటు అంటే ఆగస్టు 15 వరకు సమయం ఇస్తున్నామని.. ఆ తర్వాత 15 రోజులకు శరీర ఫిట్‌నెస్‌ను కొలుస్తామని తెలిపారు. అందులో అన్‌ఫిట్‌గా ఎవరైనా ఉన్నట్లు తేలితే వారికి స్వచ్ఛంద పదవి విరమణ కల్పిస్తామని స్పష్టం చేశారు. అయితే ఎవరికైనా హైపోథైరాయిడిజమ్ లాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇలా తాగుడికి అలవాటు, పడి నేర అభియోగాలు ఎదుర్కొంటున్న పోలీసులకు వీఆర్‌ఎస్ కల్పించి.. వారి స్థానాలను భర్తీ చేసేందుకు కొత్త వారిని నియమిస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ షర్మ కూడా గతంలోనే చెప్పారు. అయితే ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 70 వేల మంది పోలీసులు ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..