Child Care Tips: పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారం తినిపించండి..

బాల్యంలో పిల్లలకు సరైన పోషకాలు అందిస్తే.. వారి పెద్దయ్యాక కూడా ఆరోగ్యంగా ఉంటారు. యితే, కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్యానికి ఏ ఆహారాలు ఉత్తమం అనే విషయంలో గందరగోళానికి గురవుతారు. కొత్తగా తల్లిదండ్రులు అయిన వారి మరింత ఆందోళన చెందుతారు. అందుకే.. పిల్లలుకు ఎలాంటి ఆహారం తినిపిస్తే మంచిది,

Child Care Tips: పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారం తినిపించండి..
Child Care Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: May 14, 2023 | 8:09 PM

బాల్యంలో పిల్లలకు సరైన పోషకాలు అందిస్తే.. వారి పెద్దయ్యాక కూడా ఆరోగ్యంగా ఉంటారు. యితే, కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్యానికి ఏ ఆహారాలు ఉత్తమం అనే విషయంలో గందరగోళానికి గురవుతారు. కొత్తగా తల్లిదండ్రులు అయిన వారి మరింత ఆందోళన చెందుతారు. అందుకే.. పిల్లలుకు ఎలాంటి ఆహారం తినిపిస్తే మంచిది, ఏ ఆహారం పెడితే ఆరోగ్యంగా ఉంటారు? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కాయధాన్యాలు..

మీ పిల్లలకు ఆహారంగా పప్పు ధాన్యాలను ఇవ్వొచ్చు. ఇది ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాల లోపాన్ని తీరుస్తుంది. పప్పు మీ పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్యానికి దోహదపడుతుంది. పప్పు తినిపించడం ద్వారా ఎముకలు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది.

తృణధాన్యాలు..

పిల్లలు తినే ఆహారంలో తృణ ధాన్యాలు కూడా ఉండేలా చూడాలి. ఎందుకంటే పిల్లల్లో ఫైబర్ లోపం తీర్చడానికి ఇవి అద్భుతంగా పని చేస్తాయి. వీటిని తినడం వల్ల పిల్లల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. తృణధాన్యాల్లో విటమిన్లు, ఖజినాలు, యాంటీఆక్సిడెంట్లు, ఇతర అవసరమైన పోషకాలు చాలానే ఉన్నాయి. ఇవి పిల్లల్లో ఐరన్ లోపం, రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

వోట్స్..

పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు వోట్స్ కూడా తినిపించొచ్చు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ E, మెగ్నీషియం, జింక్ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఓట్స్‌లో ఉండే పోషకాలు పిల్లల పెరుగుదల, అభివృద్ధికి చాలా అవసరం. ఇది పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఓట్స్ తీసుకోవడం వల్ల పిల్లల్లో ఊబకాయం తగ్గుతుంది.

క్వినోవా..

పిల్లలకు క్వినోవా కూడా తినిపించొచ్చు. ఇందులో విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. క్వినోవా పిల్లల్లో రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

పాల ఉత్పత్తులు..

పిల్లలకు పాలు, పనీర్, మజ్జిగ, పెరుగు వంటి పాల ఉత్పత్తులను ఇవ్వాలి. పాల ఉత్పత్తులలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇవి పిల్లల ఎముకలను దృఢంగా మారుస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..