AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Jayanti 2023: మే 19న శని జయంతి.. ఈ రోజు ఇలా చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయ్..

శని జయంతిని శని అమావాస్య అని కూడా అంటారు. హిందూ మత విశ్వాసం ప్రకారం.. ఈ రోజున శని భగవానుడి పుట్టినరోజుగా జరుపుకుంటారు. శని దేవుడు తన జ్యోతిష్య ప్రభావాల వల్ల చాలా మంది జీవితాలను ప్రభావితం చేస్తాడు. ధార్మిక దృక్కోణంలో శని జయంతి రోజున నిజమైన భక్తితో, ఆచార సంప్రదాయాలను పాటించి పూజించే భక్తులపై సానుకూల ప్రభావాన్ని చూపుతారు.

Shani Jayanti 2023: మే 19న శని జయంతి.. ఈ రోజు ఇలా చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయ్..
Shani Jayanti
Shiva Prajapati
|

Updated on: May 13, 2023 | 5:24 PM

Share

శని జయంతిని శని అమావాస్య అని కూడా అంటారు. హిందూ మత విశ్వాసం ప్రకారం.. ఈ రోజున శని భగవానుడి పుట్టినరోజుగా జరుపుకుంటారు. శని దేవుడు తన జ్యోతిష్య ప్రభావాల వల్ల చాలా మంది జీవితాలను ప్రభావితం చేస్తాడు. ధార్మిక దృక్కోణంలో శని జయంతి రోజున నిజమైన భక్తితో, ఆచార సంప్రదాయాలను పాటించి పూజించే భక్తులపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నారు. వారి కష్టాలను తొలగిస్తారు. దాంతోపాటు.. జాతకంలో శనికి సంబంధించిన ఏదైనా దోషం ఉంటే.. ఈ రోజున శని దేవుడిని పూజించాలి. శని జయంతి ఎప్పుడు వస్తుంది? శనికి సంబంధించిన పరిహారాలేంటి? కష్టాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి? వంటి ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

శని జయంతి..

పంచాంగం ప్రకారం.. శని జయంతి శుక్రవారం, 19 మే 2023న వస్తుంది. అయితే, అమావాస్య తేదీ మే 18 రాత్రి 9.42 గంటల నుంచి ప్రారంభం కానుంది. మరుసటి రోజు అంటే మే 19 రాత్రి 09.22 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం.. మే 19న మాత్రమే శని జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున, శనిదేవుడు తన స్వరాశి ‘కుంభం’లో స్థిరపడతాడు. ఈ కారణంగా శని జయంతి నాడు శని దేవుడిని ఆరాధించడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.

శనికి సంబంధించిన పరిహారాలు..

1. శని మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల.. శని దేవుడికి సంబంధించిన అశుభ ప్రభావాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. పూజ సమయంలో ‘‘ఓం శం శనైశ్చరాయ నమః’’ మంత్రాన్ని జపించాలి. 108 సార్లు జపించాలి.

ఇవి కూడా చదవండి

2. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నీలమణి శని గ్రహంతో సంబంధం కలిగి ఉంది. శని దేవుడు చెడు ప్రభావాలను నివారించడానికి ఇది ప్రభావవంతంగా ఉంటుందని విశ్వాసం. కానీ, ఏదైనా రత్నాన్ని ధరించే ముందు జ్యోతిష్కులను సంప్రదించడం తప్పనిసరి. వారి సలహా మేరకే రత్నాలను ధరించాలి. రత్నాలు మీ రాశి, గ్రహస్థితి అనుకూలతకు సంబంధించిన అన్ని వివరాలు పరిశీలించిన తరువాతే రత్నాలకు సంబంధించి సలహా ఇస్తారు.

3. మత విశ్వాసాల ప్రకారం.. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించాలి. అలాగే, శని దేవుడిని పూజించేటప్పుడు.. కాల టిల్, నీలం రంగు పువ్వులు, నల్లని దుస్తులు సమర్పించాలి.

4. శని జయంతి రోజున శని చాలీసా పఠించడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల శని భగవానుడు సంతోషిస్తాడు. శని చాలీసా పఠించిన వారిపై ప్రత్యేక అనుగ్రహాన్ని చూపిస్తాడు అని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి