- Telugu News Photo Gallery Spiritual photos Ayodhya Ram Mandir 40 percentage of the roof work of ram mandir has been completed see here photos
Ram Mandir: చకచకా సాగుతున్న రామ మందిరం నిర్మాణ పనులు.. వైరల్ అవుతున్న అద్భుత ఫోటోలు..
Ram Mandir: రామమందిర నిర్మాణానికి సంబంధించిన కొన్ని కొత్త చిత్రాలను రామజన్మభూమి ట్రస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ మందిరం పైకప్పు పనులు దాదాపు 40 శాతం పూర్తయ్యాయని వెల్లడించింది.
Updated on: May 13, 2023 | 9:13 PM

అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం పైకప్పు పనులు 40 శాతం పూర్తయ్యాయి. రామ మందిరం వడి వడిగా అద్భుతమైన రూపాన్ని సంతరించుకుంటోంది. ప్రస్తుతం ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శాశ్వత గర్భగుడిలో రామ్ లల్లా ప్రతిష్టాపన తేదీని ప్రకటించారు. జనవరి 22, 2024న రామాలయంలో రామలల్లా ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రామాలయంలో కొత్త, పాత రామ్‌లల్లా విగ్రహాలకు పూజలు నిర్వహించనున్నారు. జనవరి 22, 2024న, రామమందిరంలోని గర్భగుడిలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య రామ్ లల్లాను ప్రతిష్టి్స్తారు.

ఆ తర్వాత రామమందిరాన్ని భక్తుల కోసం తెరవనున్నారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న రామభక్తులు ఈ గుడి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా, ఏప్రిల్ 24న ప్రపంచంలోని ఏడు ఖండాలకు చెందిన 155 దేశాల నదుల నీరు అయోధ్యకు చేరుకుంది. అయోధ్యలోని రామలల్లా ఈ నీటితో అభిషేకించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేతలు, వివిధ దేశాల రాయబారులు, ఎన్నారైలు పాల్గొన్నారు.



















