AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బైక్ కోసం పీఠల మీద పెళ్లిని ఆపేసిన వరుడు.. ఎమ్మెల్యే రసమయి ఎంట్రీతో ఆల్ హ్యాపీస్..

Telangana: వరకట్నం విషయంలో ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. కొందరు మనుషులు మారడం లేదు. కొందరు పెళ్లి తరువాత అదనపు కట్నం కోసం తమ భార్యలను వేధింపులకు గురి చేస్తుంటే.. మరికొందరు పీఠల మీద పెళ్లికి నో చెబుతూ అమ్మాయి కుటుంబాన్ని ఆందోళనకు గురి చేస్తున్నారు. కట్నం ఇస్తే గానీ మూడు ముళ్లు వేయమంటూ మారాం చేస్తున్నారు.

Telangana: బైక్ కోసం పీఠల మీద పెళ్లిని ఆపేసిన వరుడు.. ఎమ్మెల్యే రసమయి ఎంట్రీతో ఆల్ హ్యాపీస్..
Mla Rasamayi Balakishan
Shiva Prajapati
|

Updated on: May 12, 2023 | 4:59 PM

Share

వరకట్నం విషయంలో ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. కొందరు మనుషులు మారడం లేదు. కొందరు పెళ్లి తరువాత అదనపు కట్నం కోసం తమ భార్యలను వేధింపులకు గురి చేస్తుంటే.. మరికొందరు పీఠల మీద పెళ్లికి నో చెబుతూ అమ్మాయి కుటుంబాన్ని ఆందోళనకు గురి చేస్తున్నారు. కట్నం ఇస్తే గానీ మూడు ముళ్లు వేయమంటూ మారాం చేస్తున్నారు. కొన్నిసార్లు పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కట్నంపై ఆశతో కొందరు వ్యక్తులు చేసే పని వల్ల అమ్మాయి, వారి కుటుంబం తీవ్ర వ్యధకు గురవుతున్నారు. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో వెలుగు చూసింది. అది కూడా ఎమ్మెల్యే ముంగిటనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం షాక్‌కు గురి చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

శంకరపట్నం మండలం అంబాల్పూర్ మాజీ సర్పంచ్ గాజుల లక్ష్మీ – మల్లయ్య కూతురు అనూష వివాహం సైదాపూర్ మండలం వెన్నెంపల్లి గ్రామానికి చెందిన సంఘాల వినయ్ అనే యువకుడితో ఇటీవల కుదిరింది. కట్నం కింద రూ.5 లక్షలతో పాటు బైక్ ఒప్పుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులది నిరుపేద దళిత కుటుంబం అయినప్పటికి అప్పోసప్పో చేసి పెళ్ళికి ముందే రూ.5 లక్షలు ముట్టజెప్పారు. ఈరోజు కేశవపట్నంలోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహం జరగాల్సి ఉండగా ఆశీర్వదించడానికి ఎమ్మెల్యే రసమయి ఫంక్షన్ హాల్లో అడుగు పెట్టారు. పెళ్లి బాజా మొగాల్సిన పచ్చని పందిట్లో వధువు వరుడి ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో నాకు బైక్ కొనిస్తేనే అమ్మాయి మెడలో తాళి కడుతాను లేకపోతే వెళ్ళిపోతాను అంటూ పెళ్లి కొడుకు బీస్మించడంతో పెళ్ళి కూతురు కుటంబ సభ్యులంతా కన్నీటి పర్యాంతమయ్యారు.

ఆపద్భాంధవుడిలా ఎమ్మెల్యే రసమయి..

ఈ సంఘటనను కళ్లారా చూసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. పెళ్లి కొడుకుతో మాట్లాడి నచ్చజెప్పారు. బైక్‌ను తాను కొనిస్తాని హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన రూ. లక్ష నగదును పెళ్లి కొడుకు తండ్రి చేతిలో పెట్టారు. దీంతో పెళ్ళికి అంగీకరించిన వినయ్.. అనూష మేడలో తాళి కట్టారు. రసమయి బాలకిషన్ స్వయంగా దగ్గరుండి పెళ్లి పనులు అన్ని చూసుకుంటూ తోబుట్టువు లాంటి చెల్లెలి పెళ్ళికి కట్నంగా బైక్ కొనిచ్చి తన ఔధార్యాన్ని చాటుకున్నారు. రసమయి ఔదర్యం పట్ల ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..