AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెనక్కి నడవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు.. తెలుసుకుంటే షాక్ అవుతారు

Walking Backwards Benefits: ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో ప్రచురితమైన ఒక పరిశోధన ప్రకారం, వెనుకకు నడవడం వల్ల కీళ్ల ఆరోగ్యం, కండరాల బలం, సమతుల్యత, గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు మెరుగుపడుతాయి. సాధారణంగా ముందుకు నడిచే అలవాటు ఉన్న మనం, అడుగుల దిశను మార్చడం ద్వారా శరీరానికి కొత్త సవాలు ఇవ్వవచ్చు.

Rajashekher G
|

Updated on: Mar 09, 2026 | 1:09 PM

Share
ఇటీవల కాలంలో చాలా దేశాల్లో వెనుకకు నడవడం (రివర్స్ లేదా రెట్రో వాకింగ్) అనే వ్యాయామం వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఫిట్‌నెస్ అభిమానులు, ఫిజియోథెరపిస్టులు, ఆరోగ్య పరిశోధకులు ఈ నడకనే ఫాలో అవుతున్నారు. మొదట్లో ఇది కొంచెం విచిత్రంగా అనిపించినా, శరీరం, మెదడుకు ఇది అనేక ప్రయోజనాలు అందిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

1 / 7
భోజనం తర్వాత 10 నుంచి 20 నిమిషాలు తేలికపాటి వాకింగ్‌ చేయాలి. చాలా వేగంగా లేదా ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా నడిస్తే సరిపోతుంది. జీర్ణక్రియ ప్రక్రియను ప్రభావితం చేయకుండా నెమ్మదిగా నడవడం మంచిది. భోజనం ఎక్కువగా తీసుకుంటే, మొదటి 10-15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. తరువాత నెమ్మదిగా నడవడం ప్రారంభించాలి. క్రమం తప్పకుండా సమతుల్యంగా రోజువారీ వాకింగ్‌ చేయడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

2 / 7
ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ గిరి ఏం చెబుతున్నారంటే.. భోజనం చేసిన వెంటనే వేగంగా నడవడం సాధారణంగా మంచిది కాదు. భోజనం చేసిన తర్వాత శరీరంలో ఎక్కువ రక్త ప్రవాహం జీర్ణవ్యవస్థ వైపు మళ్ళించబడుతుంది. ఇది సరైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాంటి సందర్భాలలో భోజనం చేసిన వెంటనే వేగంగా నడవడం, భారీ కార్యకలాపాల్లో పాల్గొనడం జీర్ణ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది కొంతమందిలో కడుపు నొప్పి, ఆమ్లత్వాన్ని కలిగిస్తుంది. అయితే తిన్న వెంటనే కొన్ని నిమిషాలు నెమ్మదిగా నడవడం హానికరం కాదు. భోజనం చేసిన 10 నుంచి 15 నిమిషాల తర్వాత సౌకర్యవంతంగా కాస్త నెమ్మదిగా నడవడం మంచిది.

3 / 7

సమతుల్యత, శరీర సమన్వయం..

వెనుకకు నడవడం శరీర సమతుల్యత, సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ముందుకు నడవడం మనకు అలవాటు కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా చేస్తాం. కానీ వెనుకకు నడవడం సమయంలో శరీరం కొత్త కదలికకు అలవాటు పడాల్సి ఉంటుంది.
ఈ సమయంలో మెదడు ప్రోప్రియోసెప్షన్ (శరీర స్థానం, కదలికపై అవగాహన) పై ఎక్కువగా ఆధారపడుతుంది. దీంతో నాడీ వ్యవస్థ,  కండరాల మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. ప్రత్యేకంగా వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగకరం. సురక్షితమైన ప్రదేశంలో లేదా ట్రెడ్‌మిల్‌పై వెనుకకు నడవడం సాధన చేస్తే పడిపోవడం వంటి ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.

సమతుల్యత, శరీర సమన్వయం.. వెనుకకు నడవడం శరీర సమతుల్యత, సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ముందుకు నడవడం మనకు అలవాటు కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా చేస్తాం. కానీ వెనుకకు నడవడం సమయంలో శరీరం కొత్త కదలికకు అలవాటు పడాల్సి ఉంటుంది. ఈ సమయంలో మెదడు ప్రోప్రియోసెప్షన్ (శరీర స్థానం, కదలికపై అవగాహన) పై ఎక్కువగా ఆధారపడుతుంది. దీంతో నాడీ వ్యవస్థ, కండరాల మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. ప్రత్యేకంగా వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగకరం. సురక్షితమైన ప్రదేశంలో లేదా ట్రెడ్‌మిల్‌పై వెనుకకు నడవడం సాధన చేస్తే పడిపోవడం వంటి ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.

4 / 7
గుండె ఆరోగ్యం, కేలరీల దహనం.. 

పరిశోధనలు చెబుతున్నట్టు, అదే దూరం నడిచినా వెనుకకు నడిచేటప్పుడు హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉంటుంది. అంటే తక్కువ వేగంతో నడిచినా శరీరం ఎక్కువ శ్రమ పడుతుంది. దీంతో కేలరీలు ఎక్కువగా దహనం అవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి పరుగెత్తలేని వారు లేదా తక్కువ ప్రభావం కలిగిన వ్యాయామం కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.
సాధారణ నడకలో కొన్ని నిమిషాలు వెనుకకు నడిచే విధంగా వ్యాయామాన్ని మార్చుకుంటే ఏరోబిక్ ఫిట్‌నెస్, కండరాల బలం రెండూ పెరుగుతాయి.

గుండె ఆరోగ్యం, కేలరీల దహనం.. పరిశోధనలు చెబుతున్నట్టు, అదే దూరం నడిచినా వెనుకకు నడిచేటప్పుడు హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉంటుంది. అంటే తక్కువ వేగంతో నడిచినా శరీరం ఎక్కువ శ్రమ పడుతుంది. దీంతో కేలరీలు ఎక్కువగా దహనం అవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి పరుగెత్తలేని వారు లేదా తక్కువ ప్రభావం కలిగిన వ్యాయామం కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. సాధారణ నడకలో కొన్ని నిమిషాలు వెనుకకు నడిచే విధంగా వ్యాయామాన్ని మార్చుకుంటే ఏరోబిక్ ఫిట్‌నెస్, కండరాల బలం రెండూ పెరుగుతాయి.

5 / 7
కానీ ప్రతి వ్యక్తి జీర్ణ సామర్థ్యం భిన్నంగా ఉంటుంది. శరీర అవసరాలు కూడా మారవచ్చు. నేటి ఫిట్‌నెస్ ట్రెండ్‌ల కారణంగా ఈ అలవాటును ఎక్కువగా అవలంబిస్తున్నారు. కానీ సరైన సమాచారం లేకుండా ఏదైనా అలవాటును అనుసరించడం అంత మంచిది కాదు. అందువల్ల నడవడానికి సరైన సమయం తెలుసుకోవడం ఏమిటో తప్పక తెలుసుకోవాలి..

6 / 7
వెనుకకు నడవడం సాధారణంగా కనిపించినా, ఇది శరీరం, మెదడుకు కొత్త సవాళ్లు ఇచ్చే సమగ్ర వ్యాయామం. రోజువారీ నడకలో కొద్దిసేపు వెనుకకు నడవడం అలవాటు చేసుకుంటే కీళ్ల ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, సమతుల్యత, మెదడు చురుకుదనం అన్నీ మెరుగుపడే అవకాశం ఉంది.

7 / 7
Follow Us