AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheque Bounce: మీ చెక్కు బౌన్స్ అయిందా? లైట్‌ తీసుకోకండి.. క్రెడిట్ స్కోర్‌పై ఎఫెక్ట్‌ పడుతుందా?

Cheque Bounce: చెక్ బౌన్స్... చాలామంది దీన్ని చిన్న విషయంగా లైట్ తీసుకుంటుంటారు. కానీ నిజంగా దీని వల్ల మీ ఆర్థిక భవిష్యత్తు ప్రభావం అవడమే కాకుండా తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని గుర్తించుకోండి. మన దేశంలో చెక్ బౌన్స్ కేసులు నేటికీ కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మీ అకౌంట్లో డబ్బు లేకపోవడం వల్ల చెక్ బౌన్స్ అయితే మీరు ఊహించని విధంగా చిక్కుల్లో పడతారు.

Cheque Bounce: మీ చెక్కు బౌన్స్ అయిందా? లైట్‌ తీసుకోకండి.. క్రెడిట్ స్కోర్‌పై ఎఫెక్ట్‌ పడుతుందా?
Cheque Bounce
Subhash Goud
|

Updated on: Apr 15, 2026 | 6:45 PM

Share

Cheque Bounce: మీ చెక్కు బౌన్స్ అయితే క్రెడిట్‌ స్కోర్‌ దెబ్బతింటుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. చెక్ బౌన్స్ అవ్వడం అనేది మీ క్రెడిట్ స్కోర్‌పై (CIBIL Score) ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతుంది. అయితే, ఇది మీరు ఎవరికి చెక్కు ఇచ్చారు? ఏ కారణంతో బౌన్స్ అయింది అనే దానిపై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి.

ఇది కూడా చదవండి: AC Offer: ఏసీ కొనాలని ఉందా? కేవలం రూ.1 కే కొత్త ఏసీని ఇంటికి తీసుకెళ్లండి.. రిలయన్స్ అదిరిపోయే ఆఫర్లు!

  1. లోన్ లేదా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ (EMI) చెక్కులు: మీరు ఏదైనా బ్యాంకు నుండి రుణం తీసుకుని, దానికి సంబంధించిన ఈఎంఐ చెక్కు బౌన్స్ అయితే, అది మీ క్రెడిట్ స్కోర్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. బ్యాంకులు ప్రతి నెలా మీ చెల్లింపుల సమాచారాన్ని సిబిల్ (CIBIL) వంటి క్రెడిట్ బ్యూరోలకు పంపుతాయి. చెక్కు బౌన్స్ అవ్వడం అంటే మీరు సకాలంలో చెల్లింపు చేయలేదని అర్థం. దీనివల్ల మీ స్కోర్ పడిపోతుంది.
  2. వ్యక్తిగత లేదా వ్యాపార చెక్కులు: మీరు ఒక వ్యక్తికి లేదా ప్రైవేట్ సంస్థకు ఇచ్చిన సాధారణ చెక్కు బౌన్స్ అయితే, అది నేరుగా మీ క్రెడిట్ స్కోర్‌కు రిపోర్ట్ అవ్వదు. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. చెక్కు బౌన్స్ అయిన వ్యక్తి మీపై సెక్షన్ 138 కింద కేసు వేస్తే, ఆ విషయం బ్యాంకింగ్ రికార్డుల్లో “నెగటివ్ మార్క్”గా నమోదైతే భవిష్యత్తులో మీరు లోన్ తీసుకోవడం కష్టమవుతుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. బ్యాంక్ విధించే పెనాల్టీలు: చెక్కు బౌన్స్ అయిన ప్రతిసారీ బ్యాంక్ మీ ఖాతా నుండి ‘చెక్ రిటర్న్ ఛార్జీలు’ వసూలు చేస్తుంది. ఒకవేళ మీ ఖాతాలో బ్యాలెన్స్ లేక ఆ ఛార్జీల వల్ల ఖాతా ‘మైనస్’లోకి వెళ్తే, అది కూడా మీ ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తుంది. చెక్కు బౌన్స్ వల్ల కలిగే ఇతర నష్టాలు కూడా ఉంటాయి.  పదే పదే చెక్కులు బౌన్స్ అయితే బ్యాంక్ మీ ఖాతాను మూసివేయవచ్చు లేదా మీకు కొత్త చెక్ బుక్ ఇవ్వడానికి నిరాకరించవచ్చు. జైలు శిక్ష: చెక్కు బౌన్స్ అవ్వడం అనేది భారతదేశంలో క్రిమినల్ నేరం. దీనికి జరిమానాతో పాటు రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Gold Limit Rules: బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను ఏంటి?

క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా ఉండాలంటే?:

  • ముందే బ్యాలెన్స్ చూసుకోవడం: చెక్కు ఇచ్చే ముందు లేదా ఈఎంఐ తేదీకి ముందే ఖాతాలో సరిపడా డబ్బు ఉందో లేదో చూసుకోండి.
  • స్టాప్ పేమెంట్: పొరపాటున తప్పుడు చెక్కు ఇస్తే, వెంటనే బ్యాంకును సంప్రదించి ‘స్టాప్ పేమెంట్’ రిక్వెస్ట్ ఇవ్వండి (అయితే ఇది సరైన కారణం ఉన్నప్పుడే చేయాలి).
  • ఆటో డెబిట్: వీలైనంత వరకు ఈఎంఐల కోసం చెక్కుల కంటే NACH/ECS (ఆటో డెబిట్) పద్ధతిని వాడండి. మీ ఆర్థిక ప్రతిష్టను, క్రెడిట్ స్కోర్‌ను కాపాడుకోవడానికి చెక్కుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క చెక్కు బౌన్స్ అయినా అది భవిష్యత్తులో మీకు లోన్ రాకుండా చేసే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us