Weight Loss: స్లిమ్‌గా ఉండేందుకు జపనీయుల ప్రత్యేక ఫార్ములా.. ఇది పాటిస్తే ఊబకాయం పరార్..!
ప్రస్తుత కాలంలో ఊబకాయం ప్రతి ఒక్కరికీ సమస్యగా మారింది. సమయపాలన లేకుండా తినడం, అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. క్రమంగా బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. ఇంకేముంది.. పెరిగిన బెల్లీ ఫ్యాట్‌ను చూసి బాబోయ్ అంటూ వ్యాయామం, డైట్ మొదలు పెడతారు. కానీ, ఫలితం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.
ప్రస్తుత కాలంలో ఊబకాయం ప్రతి ఒక్కరికీ సమస్యగా మారింది. సమయపాలన లేకుండా తినడం, అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. క్రమంగా బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. ఇంకేముంది.. పెరిగిన బెల్లీ ఫ్యాట్‌ను చూసి బాబోయ్ అంటూ వ్యాయామం, డైట్ మొదలు పెడతారు. కానీ, ఫలితం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.
అధిక బరువుతో బాధపడుతున్నవారు ఎప్పుడైనా జపనీయులను చూశారా? వారు స్లిమ్‌గా, ఆరోగ్యంగా, చలాకీగా ఉంటారు. మరి జపనీయుల స్లిమ్‌నెస్, యాక్టివిటీ రహస్యం ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. జపనీయుల ఆరోగ్య రహస్యం.. వారి ఆహారమే. స్థిరమైన ఆహార ఫార్ములాను అనుసరించి స్థూలకాయాన్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా ఉంటున్నారు. అవును ఈ ఫార్ములా కారణంగానే.. జపనీస్ ప్రజలు ఆరోగ్యంగా, సన్నగా కనిపిస్తారు. ఇంతకీ వారి డైటింగ్ ఫార్ములా ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం..
హర హచి బు..
ఈ జపనీస్ ఫార్ములా పేరు ‘హర హచి బు’. ఇది ఒక ప్రత్యేకమైన ఆహార విధానం. కానీ నేటి హడావుడి జీవితంలో ప్రజలు సరైన ఆహార విధానాన్ని పాటించడం మరిచిపోయారు. ఈ ఫార్ములా పాటించే సమయంలో బరువును అదుపులో ఉంచే కొన్ని అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి. హర హచి బు అంటే ఆకలిగా ఉన్నప్పుడే తినాలి. ఇక 80 శాతం కడుపు నిండినట్లు అనిపించగానే.. తినడం మానేయాలి. ఇది ఆరోగ్యకరమైన ఆహార నియమం. ఈ పద్ధతి ఆరోగ్యం, సుదీర్ఘ ఆయువుని ఇస్తుంది. ‘హర హచి బు’ జపాన్ ప్రజలందరూ ఇదే విధానాన్ని అవలంభిస్తారు. ఈ కారణంగానే.. వారందరూ ఫిట్‌గా, స్లిమ్‌గా ఉంటారు. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా జపాన్‌లోనే ఎక్కువ కాలం జీవించే వారు, ఆరోగ్యవంతులు ఉన్నారని చెప్పొచ్చు.
‘హర హచి బు’ నియమాలు..
‘హర హచి బు’కి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను పాటిస్తే పెరిగిన బరువు ఈజీగా తగ్గుతుంది. ఇప్పటికే ఫిట్‌గా ఉన్నట్లయితే, భవిష్యత్‌లో ఊబకాయం వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.
1. 80 శాతం మాత్రమే తినాలి.
ఆకలిగా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. అది కూడా 80 శాతం మాత్రమే తినాలి. ఆ తరువాత తినొద్దు. కడుపును కాస్త ఖాళీగా ఉంచాలి. తద్వారా ఆ ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కొవ్వుకు బదులుగా శక్తిగా మారుస్తుంది.
2. మితంగా తినాలి..
మీరు తినే ప్లేట్ చిన్నదిగా ఉండాలి. దీనివల్ల.. పరిమితమైన ఆహారం మాత్రమే తీసుకోగలుగుతారు. ఎక్కువ ఆకలి అనిపిస్తే.. మరోసారి కొంచెం తినొచ్చు. అయితే, మీరు తినే దానిపై ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇది మీ ఆకలిని నియంత్రించడానికి ఉపకరిస్తుంది.
3. తినే ఆహారంపై దృష్టి పెట్టాలి..
ప్రస్తుత కాలంలో చాలా మంది టీవీ, మొబైల్ చూస్తూ ఆహారం తింటారు. అలా చేయడం తప్పు. తినడానికి కూర్చున్నప్పుడు మీ దృష్టి ఆహారంపై మాత్రమే ఉండాలి. ఇది హర హచి బు విధానంలో అత్యంత కీలకం. ఇలా చేయడం ద్వారా తినే ఆహారంపై అప్రమత్తంగా ఉంటారు. ఎంత అవసరమో.. అంతే తింటారు. తద్వారా బరువు కూడా తగ్గుతారు.
4. కొంచెం కొంచెం తినాలి..
ఆహారాన్ని కొంచెం కొంచెం తినాలి. ప్రతి ముద్దను ఎక్కువసార్లు నమిలి మింగాలి. ఇలా చేయడం ద్వారా తినే ఆహారం సరిగా జీర్ణమవుతుంది. శరీరానికి శక్తి అందుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..