AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooling Gel Mattress: ఈ బెడ్ షీట్ కప్పుకుంటే ఏసీ, కూలర్, ఫ్యాన్ అవసరమే లేదు.. వేసవిలోనూ చలికి వణికిపోవాల్సిందే..!

వేసవి వచ్చిందంటే చాలు.. జనాలు హడలిపోతారు. ఉక్కపోత, వేడి గాలులతో అల్లాడిపోతారు. అందుకే వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీ, కూలర్స్ వంటివి ఏర్పాటు చేసుకుంటారు. ఇందుకోసం భారీగా డబ్బులు వెచ్చిస్తారు. అయితే, ఇలాంటి భారీ ఖర్చు లేకుండా ఉండేందుకు మీకోసం అద్భుతమైన న్యూస్ తీసుకొచ్చాం.

Cooling Gel Mattress: ఈ బెడ్ షీట్ కప్పుకుంటే ఏసీ, కూలర్, ఫ్యాన్ అవసరమే లేదు.. వేసవిలోనూ చలికి వణికిపోవాల్సిందే..!
Cooling Gel Mattress
Shiva Prajapati
|

Updated on: May 13, 2023 | 8:19 PM

Share

వేసవి వచ్చిందంటే చాలు.. జనాలు హడలిపోతారు. ఉక్కపోత, వేడి గాలులతో అల్లాడిపోతారు. అందుకే వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీ, కూలర్స్ వంటివి ఏర్పాటు చేసుకుంటారు. ఇందుకోసం భారీగా డబ్బులు వెచ్చిస్తారు. అయితే, ఇలాంటి భారీ ఖర్చు లేకుండా ఉండేందుకు మీకోసం అద్భుతమైన న్యూస్ తీసుకొచ్చాం. వేసవిలో బడ్జెట్ పై ప్రభావం పడకుండా ఉండేలా, వేసవి తాపాన్ని తట్టుకునే ఐడియాను తీసుకువచ్చాం. అవును, ఏసీ, కూలర్ కంటే తక్కువ ధరకే.. విద్యుత్ అవసరం లేని అనేక ఉత్పత్తులు ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్నాయి. వీటి ద్వారా ప్రజలు వేలాది రూపాయలను ఆదా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతకీ ఆ ప్రోడక్ట్ ఏంటి? వేసవిలోనూ మిమ్మల్ని కూల్‌గా ఉంచే వస్తువు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం మార్కెట్‌లో బాగా ట్రెండ్‌లో ఉన్నది జెల్ మ్యాట్రెస్, బెడ్ షీట్. ఇది ఉంటే, ఏసీ, కూలర్ ఏదీ అవసరం లేదు. ప్రతినెలా విద్యుత్ బిల్లు టెన్షన్ కూడా ఉండదు.

జెల్ మ్యాట్రెస్/బెడ్ షీట్ ధర, వివరాలు..

కూలింగ్ జెల్ మ్యాట్రెస్‌ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. ఇంట్లో కూర్చొనే కొనుగోలు చేయొచ్చు. ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వెబ్‌సైట్‌లో అతి తక్కువ ధరకే ఇది అందుబాటులో ఉంది. ఇక దీని ధర కూడా రూ. 1500 నుంచి అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

జెల్ మ్యాట్రెస్/బెడ్ షీట్ ఫీచర్లు..

వినియోగదారులకు చల్లని అనుభూతిని అందించడానికి ఈ మ్యాట్రెస్‌లో జెల్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది పని చేయడానికి ప్లగ్ ఇన్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత అది ఆటోమాటిక్‌గా బెడ్‌పై ఉన్న షీట్‌ను చల్లబరుస్తుంది. ఇక ఇది ఎలాంటి శబ్ధం చేయదు. యాక్టీవ్ కండిషన్‌లో వైబ్రేట్ కూడా చేయదు. వేసవిలో చలచల్లగా, హాయిగా దీనిపై నిద్రపోవచ్చు.

ఇది చాలా ముఖ్యం..

అయితే, ఈ మ్యాట్రెస్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. బెడ్‌షీట్ మురికిగా ఉంటే.. శుభ్రం చేయడానికి తడిగుడ్డను ఉపయోగించకూడదు. పొడి గుడ్డతో మాత్రమే శుభ్రం చేయాలి. ఇక బెడ్ షీట్‌ను ప్రతి రోజూ ఉపయోగించొచ్చు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..