Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అమ్మ బాబోయ్.. ఒకే టైమ్‌లో రెండు ప్రాణ గండాలు తప్పాయి.. దడ పుట్టించే వీడియో

ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి పొంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. మనం సరైన, సురక్షితమైన ప్రదేశంలో ఉన్నప్పటికీ.. పరిస్థితితులు ప్రతికూలంగా ఉండొచ్చు. మృత్యువు ఏ రూపంలోనైనా, ఏ వైపు నుంచైనా దూసుకురావొచ్చు. తృటిలో ఒక ప్రమాదం నుంచి తప్పించుకున్నా.. గ్రహచారం బాలేక మరో ప్రమాదంలోనైనా చిక్కుకోవచ్చు.

Watch Video: అమ్మ బాబోయ్.. ఒకే టైమ్‌లో రెండు ప్రాణ గండాలు తప్పాయి.. దడ పుట్టించే వీడియో
Accident
Follow us
Shiva Prajapati

|

Updated on: May 13, 2023 | 9:08 PM

ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి పొంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. మనం సరైన, సురక్షితమైన ప్రదేశంలో ఉన్నప్పటికీ.. పరిస్థితితులు ప్రతికూలంగా ఉండొచ్చు. మృత్యువు ఏ రూపంలోనైనా, ఏ వైపు నుంచైనా దూసుకురావొచ్చు. తృటిలో ఒక ప్రమాదం నుంచి తప్పించుకున్నా.. గ్రహచారం బాలేక మరో ప్రమాదంలోనైనా చిక్కుకోవచ్చు. ఈ పరిస్థితిని అస్సలు ఊహించలేం. కానీ, తాజాగా ఇందుకు నిదర్శనమైన, గుండె గుభేల్ అనే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటజిన్లు సైతం షాక్ అవుతున్నారు. అయితే, ఇక్కడ అదృష్టం ఏంటంటే.. వీడియోలోని వ్యక్తి ఏక కాలంలో రెండు ప్రమాదాల నుంచి బయటపడ్డాడు. అవును, మరెందుకు ఆలస్యం.. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఊబర్ ఈట్స్ డెలివరీ బాయ్.. రోడ్డు పక్కన పార్కింగ్ ప్లేస్‌లో తన బైక్ పార్క్ చేసి, పార్సిల్ బ్యాగ్‌ను భుజానికి వేసుకుంటున్నాడు. ఇంతలో ఓ కారు రెప్పపాటు వ్యవధిలో దూసుకొచ్చింది. తన ముందున్న కారును ఢీకొట్టింది. అప్పటికే కారు రావడాన్ని గమనించిన డెలివరీ బాయ్.. తప్పించుకునేందుకు రోడ్డువైపు పరుగులు తీశాడు. అయితే, అదే సమయంలో రోడ్డుకు అవతలివైపు నుంచి మరో కారు దూసుకొచ్చింది. అయితే, ఆ కారు డ్రైవర్ అప్రమత్తతో డెలివరీ బాయ్ సేఫ్ అయ్యాడు. లేకుంటేనా పరిస్థితి దారుణంగా ఉండేది.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ భయానక ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ అవుతుందో. ప్రమాదం జరిగిన తీరును చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. డెలివరీ బాయ్ లేచిన టైమ్ బాగుందని, లేదంటే ప్రాణాలే పోయేవని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మద్యం మత్తులో ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..