Bigg Boss 9 Telugu : దివ్వెల మాధురి మంచి మనసు.. పేదలకు బిగ్ బాస్ రెమ్యునరేషన్ విరాళం.
బిగ్ బాస్ సీజన్ 9.. ఇప్పుడు రసవత్తరంగా సాగుతుంది. ఈ సీజన్ విన్నర్ రేసులో పోటా పోటీగా దూసుకుపోతున్నారు. తనూజ, కళ్యాణ్ మధ్య స్వల్ప ఓటింగ్ తేడా ఉండగా.. మూడో స్థానంలో ఉన్నాడు ఇమ్మాన్యుయేల్. కామనర్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్, డీమాన్ ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్ గా మారారు.

బిగ్ బాస్ సీజన్ 9.. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీంతో ఇప్పుడు హౌస్మేట్స్ మధ్య రసవత్తరమైన పోటీ జరుగుతుంది. గత వారం రోజులుగా ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం ఉత్కంఠగా సాగిన టాస్కులలో చివరకు విజేతగా నిలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కళ్యాణ్ పడాల. మరోవైపు టైటిల్ విన్నర్ రేసులో నువ్వా నేనా అన్నట్లుగా దూసుకుపోతున్నారు కళ్యాణ్, తనూజ. ఇదంతా పక్కన పెడితే.. మొత్తం 15 మందితో మొదలైన ఈ షోలో ఆ తర్వాత కామనర్ దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. రమ్య మోక్ష, దివ్వెల మాధురి, సాయి శ్రీనివాస్, అయేషా, గౌరవ్, నిఖిల్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి.. అంతే వేగంగా హౌస్ నుంచి బయటకు వచ్చారు.
ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో ఫైర్ బ్రాండ్ లా ఎంట్రీ ఇచ్చి.. మొదటి వారమే హౌస్ లో రచ్చ రచ్చ చేసింది దివ్వెల మాధురి. మొదటి వారంలోనే గొడవలతో హాట్ టాపిక్ గా మారిన మాధురి.. ఆ తర్వాత నాగార్జున హెచ్చరించడంతో తన ఆట తీరు మార్చుకుంది. కానీ తక్కువ సమయంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చింది. తాజాగా ఆమె తన బిగ్ బాస్ రెమ్యునరేషన్ ను డొనేట్ చేస్తూ మంచి మనసు చాటుకుంది. కష్టంలో ఉన్న పేదవారికి తనవంతు సాయం చేసింది.
దువ్వాడ శ్రీను, మాధురి దంపతుల అనుచరుడిగా ఉన్న లక్ష్మీ నారాయణ.. బ్రెయిన్ సంబంధిత వ్యాధితో ఆసుపత్రి పాయ్యారు. అతడిని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన దువ్వాడ మాధురి, శ్రీనివాస్ రూ.80,000 ఆర్థిక సాయం అందించారు. అందులో రూ.30,000 ఆసుపత్రి వైద్య ఖర్చులు కాగా.. కుటుంబ పోషణ నిమిత్తం మరో రూ.50 వేలు అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..




