Driving Tips: రాత్రిపూట డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే నిద్ర రాదు..!

రోడ్డుపై వాహనం నడపడం చాలా బాధ్యతాయుతమైన పని. చిన్న పొరపాటు జరిగినా మీ ప్రాణాలతో పాటు ఇతర వ్యక్తుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుంది. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది రాత్రిపూట వాహనాలు నడుపుతుంటారు. అయితే, అలసట కారణంగా చాలాసార్లు డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతుంటారు.

Driving Tips: రాత్రిపూట డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే నిద్ర రాదు..!
Driving Tips
Follow us

|

Updated on: May 14, 2023 | 8:24 PM

రోడ్డుపై వాహనం నడపడం చాలా బాధ్యతాయుతమైన పని. చిన్న పొరపాటు జరిగినా మీ ప్రాణాలతో పాటు ఇతర వ్యక్తుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుంది. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది రాత్రిపూట వాహనాలు నడుపుతుంటారు. అయితే, అలసట కారణంగా చాలాసార్లు డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతుంటారు. దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీరు కూడా రాత్రిపూట డ్రైవింగ్ చేస్తుంటే.. నిద్ర వల్ల ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రోడ్డు పక్కన వాహనం ఆపాలి..

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు నిద్ర వచ్చినప్పుడల్లా రోడ్డు పక్కన కాసేపు వాహనాన్ని పార్క్ చేసి, వాహనం దిగి అటూ ఇటూ నడవాలి. లేదంటే కొంచె వ్యాయామం చేయాలి. దాంతో పాటు కొన్ని నీళ్లు తాగి కళ్లపై నీళ్లు చల్లుకోవాలి.

అతిగా ఆహారం తినొద్దు..

కడుపు నిండా ఆహారం తింటే.. నిద్ర పడుతుంది. అందుకే డ్రైవింగ్‌కు ముందు ఎక్కువ ఆహారం తీసుకోవద్దు. కొంచెం కొంచెం తినడం బెటర్. దీని వల్ల నిద్ర రాకపోగా.. ఇంకా ఎనర్జీ వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇష్టమైన పాటలు వినాలి..

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రపోకుండా ఉండటానికి మీకు ఇష్టమైన పాటలు, మ్యూజిక్ వినొచ్చు. ఇలా చేయడం వల్ల నిద్ర పట్టదు. సురక్షితంగా ప్రయాణించవచ్చు.

తేలికపాటి స్నాక్స్, టీ తీసుకోవాలి..

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్ర వచ్చినట్లు అనిపిస్తే.. దారిలో ఏదైనా దాబా లేదా రెస్టారెంట్ వద్ద ఆగి తేలికపాటి స్నాక్స్, టీ, కాఫీ తాగాలి. ఎక్కువసేపు మెలకువగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. అయితే, అతిగా కూడా తీసుకోవద్దు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..