ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా వేదికపైకి బిడ్డను విసిరిన తండ్రి.. ‘సారూ.. మీరే ఆదుకోవాలి’
బహిరంగ సభలో ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించేందుకు ఓ వ్యక్తి చేసిన పనికి అందరూ షాక్‌కు గురయ్యారు. ఏడాది వయసున్న తన బిడ్డను ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న వైదికపైకి విసిరాడు. ఆ తండ్రి అలా ప్రవర్తించడం వెనుక అంతులేని అవేదన దాగుంది మరి..
బహిరంగ సభలో ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించేందుకు ఓ వ్యక్తి చేసిన పనికి అందరూ షాక్‌కు గురయ్యారు. ఏడాది వయసున్న తన బిడ్డను ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న వైదికపైకి విసిరాడు. ఆ తండ్రి అలా ప్రవర్తించడం వెనుక అంతులేని అవేదన దాగుంది మరి.
మధ్యప్రదేశ్‌కు చెందిన ముకేశ్ పటేల్, నేహా భార్యభర్తలు. రోజువారీ కూలీ చేసుకుని పొట్టపోసుకునే ఈ జంటకు ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నాడు. ఐతే కుమారుడికి మూడు నెలల వయస్సున్నప్పుడు గుండెలో రంధ్రం ఉందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే వైద్యం కోసం కుటుంబం స్థోమతకు మించి రూ.4లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఇప్పుడు తమ బిడ్డకు ఏడాది వచ్చింది. డాక్టర్లు ఆపరేషన్ చేయలని తెలిపారు. ఐతే, ఆపరేషన్‌కు రూ.3.50 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెల్పడంతో.. ఆ డబ్బు ఎలా సమకూర్చుకోవాలో, తమ గోడు ఎవరికి వినిపించాలో తెలీక సతమతమయ్యారు. అప్పుడే సాగర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కార్యక్రమం ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడికి ముకేశ్, నేహా తమ బిడ్డను తీసుకుని వెళ్లారు. తమ సమస్యను ఎలాగైనా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని సర్వశక్తులా ప్రయత్నించారు. కానీ బందోబస్తును దాటి వెళ్లడం వారికి సాధ్యపడలేదు.
దాంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ తండ్రి వేదికపై సీఎం ప్రసంగిస్తోన్న సమయంలో ఒక్కసారిగా బిడ్డను అక్కడకు విసిరేశాడు. ఆ చర్యకు అక్కడున్నవారంతా ఉలిక్కిపడ్డారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఆ పిల్లాడిని కాపాడి, తల్లికి అప్పగించారు. అతను ఎందుకు అలా చేశాడో సీఎం అడిగి తెలుసుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తమ బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకే ఈ చర్యకు పాల్పడినట్లు అతను విన్నవించాడు. చిన్నారి సమస్య తెలుసుకున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వైద్య సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. వెంటనే స్థానిక కలెక్టర్ దీపక్ ఆర్యకు ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.