AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka CM: బెంగళూరు రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు.. ముఖ్యమంత్రి రేసులో తెరపైకి మూడో పేరు..!

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన ప్రతిష్ఠంభన ఇప్పట్లో తొలగేలా లేదు. ఎన్నికల్లో 135 స్థానాల్లో విజయఢంకా మోగించినప్పటికీ కాంగ్రెస్, సీఎల్పీల మధ్య ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై పీటముడి పడింది. డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య సస్పెన్స్‌ కొనసాగుతుండగా మూడో సీఎం అభ్యర్ధిపేరు తెరపైకి..

Karnataka CM: బెంగళూరు రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు.. ముఖ్యమంత్రి రేసులో తెరపైకి మూడో పేరు..!
Karnataka CM's post race
Srilakshmi C
|

Updated on: May 16, 2023 | 6:29 PM

Share

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన ప్రతిష్ఠంభన ఇప్పట్లో తొలగేలా లేదు. ఎన్నికల్లో 135 స్థానాల్లో విజయఢంకా మోగించినప్పటికీ కాంగ్రెస్, సీఎల్పీల మధ్య ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై పీటముడి పడింది. డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య సస్పెన్స్‌ కొనసాగుతుండగా మూడో సీఎం అభ్యర్ధిపేరు తెరపైకి  వచ్చింది.

సీనియర్‌ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ జి పరమేశ్వరను ముఖ్యమంత్రిగా నియమించాలంటూ మద్దతుదారులు మంగళవారం భారీ ప్రదర్శన చేపట్టారు. పరమేశ్వర ఫొటోలతో ప్లకార్డులు, బ్యానర్లను పట్టుకుని రోడ్లపై ప్రదర్శించారు.కాబోయే ముఖ్యమంత్రి పరమేశ్వర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దళిత నేతను ముఖ్యమంత్రి చేయాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని పార్టీ హైకమాండ్ కోరితే తాను బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాంటూ జి పరమేశ్వర మంగళవారం మీడియాకు తెలిపారు.

‘నాకు పార్టీ హైకమాండ్‌పై నమ్మకం ఉంది. నాకు కొన్ని ప్రిన్సిపుల్స్‌ ఉన్నాయి. నేను కూడా 50 మంది శాసనసభ్యులను తీసుకొని ఆర్భాటం చేయగలను. కానీ పార్టీ క్రమశిక్షణ నాకు ముఖ్యం. పార్టీ కోసం ఎంతో చేశాననే విషయం వారికి (హైకమాండ్) కూడా తెలుసు. మనం కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. సీఎం పదవి కోసం ప్రత్యేకంగా అడగవలసిన అవసరం లేదని భావిస్తున్నాను. హైకమాండ్ నాకు బాధ్యతలు అప్పగిస్తే తీసుకుంటానని’  పరమేశ్వర పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలకు మే 10న జరిగిన ఎన్నికల్లో 135 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ముఖ్యమంత్రి పదవి కోసం ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య తీవ్ర ఆధిపత్య పోరు నెలకొంది. ఈ తరుణంలో మూడో సీఎం అభ్యర్ధిగా పరమేశ్వర పేరు తెరపైకి రావడంతో కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠ భరితంగా మారాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.