West Bengal: బాణాసంచా క‌ర్మాగారంలో భారీ పేలుడు.. 9 మంది దుర్మరణం..

పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మిడ్నాపూర్‌లోని ఎగ్రాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎగ్రాలోని సహారా ప్రాంతంలోని గోపీనాథ్‌పూర్ చంద్‌కూరి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణాసంచా క‌ర్మాగారంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

West Bengal: బాణాసంచా క‌ర్మాగారంలో భారీ పేలుడు.. 9 మంది దుర్మరణం..
West Bengal
Follow us

|

Updated on: May 16, 2023 | 6:35 PM

పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మిడ్నాపూర్‌లోని ఎగ్రాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎగ్రాలోని సహారా ప్రాంతంలోని గోపీనాథ్‌పూర్ చంద్‌కూరి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణాసంచా క‌ర్మాగారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడు ధాటికి ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారని పోలీసులు తెలిపారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను ఆసుపత్రులకు త‌ర‌లించారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై సీఐడీ విచారణ జరుపుతుందని స్థానిక ఎస్పీ తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై పశ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ. 2.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు. అక్రమంగా నిర్వహిస్తున్న ఈ బాణాసంచా క‌ర్మాగారం య‌జ‌మానిని ఇటీవలనే అరెస్టు చేశామ‌ని, కానీ బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చాడ‌ంటూ పేర్కొన్నారు.

అయితే, ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు.. ఎన్ఐఏ విచారణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి తెలిపారు. ఎన్ఐఏ విచారణ జరిపి విచారిస్తే మాకు అభ్యంతరం లేదు. అయితే అసలు వ్యక్తిని పట్టుకోనివ్వండి.. అతనికి బెయిల్ ఎలా వచ్చిందో తెలియాల్సి ఉందంటూ ముఖ్యమంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!