అమెరికాలో మరో తెలుగమ్మాయి అనుమానాస్పద మృతి.. అసలేంజరిగిందంటే..

భారత సంతతికి చెందిన ఓ యువతి అమెరికాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఇటీవల టెక్సాస్‌లో అదృశ్యమైన 25 ఏళ్ల తెలుగమ్మాయి లహరి ఓక్లహామాల్‌లో 322 కిలోమీటర్ల దూరంలో శవమై కన్పించారు. బ్లాక్ టయోటా కారులో డ్రైవ్‌ చేసుకుంటూ జాబ్‌కు వెళ్లిన లహరి పతివాడ ఆ తర్వాత రోజు నుంచి కనిపించకుండా..

అమెరికాలో మరో తెలుగమ్మాయి అనుమానాస్పద మృతి.. అసలేంజరిగిందంటే..
Indian American Woman Died
Follow us
Srilakshmi C

|

Updated on: May 18, 2023 | 5:32 PM

భారత సంతతికి చెందిన ఓ యువతి అమెరికాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఇటీవల టెక్సాస్‌లో అదృశ్యమైన 25 ఏళ్ల తెలుగమ్మాయి లహరి ఓక్లహామాల్‌లో 322 కిలోమీటర్ల దూరంలో శవమై కన్పించారు. బ్లాక్ టయోటా కారులో డ్రైవ్‌ చేసుకుంటూ జాబ్‌కు వెళ్లిన లహరి పతివాడ ఆ తర్వాత రోజు నుంచి కనిపించకుండా పోయింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఓక్లహామాల్‌లో మృతదేహం ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది.

టెక్సాస్ లోని మెక్టిండియన్ ప్రాంతానికి చెందిన లహరి.. బ్లూ వ్యాలీ వెస్ట్ హై స్కూల్‌లో చదువుకున్నారు. కాన్సాస్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టాపొందారు. అనంతరం ఓవర్ ల్యాండ్ రీజినల్ మెడికల్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మే12న విధులు ముగిశాక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. చివరిసారిగా లహరి డల్లాస్ శివారులో కారు నడుపుతూ కనిపించారని స్థానికులు తెలిపారు. అదృశ్యమైన ఒక రోజు తర్వాత మే 13న ఆమె మృతదేహాన్ని గుర్తించారు.

ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమె మరణ వార్త విని కన్నీరుమున్నీరుగా విలపించారు. మరోవైపు లహరి ఎలా మృతి చెందారన్న కోణంలో విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.